తప్పతాగి స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్ ప్రమాదంలో 40 మంది విద్యార్థులు - మహారాష్ట్ర స్కూల్ బస్సు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి తప్పతాగి తూలుతూ స్కూల్ బస్సు నడిపాడు. 40 మంది విద్యార్థులను బస్సులో తీసుకెళ్తున్న అతడు అదుపుతప్పి ఆగి ఉన్న ఓ ఆటోను ఢీకొట్టాడు. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు ఏమీ కాలేదు. బుధవారం ఉదయం 8.30 గంటలకు ముంబయిలోని ఉల్వే సెక్టార్ 21లో ఈ ప్రమాదం జరిగింది. 65 ఏళ్ల అశోక్ జనార్ధన్ తాగి బస్సు నడపడమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్‌పై మోటార్ వాహన చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST