కారు టైర్ పంక్చర్ 15 నిమిషాల పాటు రోడ్డుపైనే వెయిట్ చేసిన పవన్ - pawan kalyan car tire puncture news
🎬 Watch Now: Feature Video
జగిత్యాల జిల్లా నాచుపల్లి బృందావన్ రిసార్ట్స్‌లో తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధర్మపురి బయలుదేరారు. అయితే నాచుపల్లి శివారులోకి చేరుకోగానే పవన్ ప్రయాణిస్తున్న వాహనం టైర్ పంక్చర్ అయింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు పవన్ వాహనంలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న అభిమానులు, స్థానికులు భారీగా చేరుకోవడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టైర్ మార్చిన అనంతరం అదే వాహనంలో పవన్ అక్కడి నుంచి ధర్మపురికి బయలుదేరి వెళ్లారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST