ఏం స్వామి బాగున్నావా... ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్ - KTR lunch in fluoride victim house
🎬 Watch Now: Feature Video
KTR Lunch in Fluoride Victim House మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత అంశాల స్వామి ఇంటికి అకస్మాత్తుగా వెళ్లిన కేటీఆర్ అతడి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, హెయిర్ కటింగ్ సెలూన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లోనే భోజనం చేశారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకుని గతంలో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్, ప్రభుత్వం నుంచి రెండు పడక గదుల ఇంటి నిర్మాణం కోసం ఐదున్నర లక్షలు మంజూరు చేయించారు. మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ జరిపించి పూర్తి చేయించారు. ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చిన కేటీఆర్ భవిష్యత్‌లోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు స్థానిక నేతలు ఉన్నారు. కేటీఆర్ తన ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అంశాల స్వామి తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST