కారులో దూరిన 10 అడుగుల కింగ్ కోబ్రా నాలుగు గంటలు శ్రమించి - కింగ్ కోబ్రాను పట్టుకున్న అటవీ సిబ్బంది
🎬 Watch Now: Feature Video
కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కారులో 10 అడుగుల కింగ్ కోబ్రా చేరింది. జై సింగ్ కైగా ప్రాంతం నుంచి కార్వార్కు కారులో వెళ్తున్నాడు. మార్గమధ్యలో మల్లాపుర్ ప్రాంతంలోని ఓ రోడ్డు పక్కన ఆగాడు. అయితే ఆ సమయంలో 10 అడుగుల కింగ్ కోబ్రా తన కారు ముందుభాగంలో ప్రవేశించడం గమనించాడు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న సిబ్బంది దాదాపు 4 గంటల పాటు శ్రమించి పామును బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టినట్లు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST