ETV Bharat / t20-world-cup-2022

వరల్డ్​ కప్​లో వరుణుడి ఆట.. టాప్ టీమ్​లకు షాక్.. అభిమానుల్లో నిరాశ - T20 WORLD CUP UPDATES

టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో పట్టుమని పది మ్యాచ్​లు కూడా జరగలేదు. అప్పుడే మూడు మ్యాచ్​లు రద్దయ్యాయి. ఇంకా ఎన్ని మ్యాచ్​లతో వరుణుడు ఆడుకుంటాడో అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

T20 WORLD CUP
టీ20 ప్రపంచ కప్
author img

By

Published : Oct 27, 2022, 11:24 AM IST

జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ రద్దు.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు షాక్‌.. అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు.. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12లో పట్టుమని పది మ్యాచ్‌లు కూడా జరగలేదు. అప్పుడే మూడు మ్యాచ్‌లను వరుణుడు ఆడేసుకున్నాడు. పెద్ద జట్లకు షాకిస్తూ చిన్న జట్లను మురిపిస్తూ రెండు మ్యాచ్‌లు తుడిచిపెట్టేశాడు. మరో మ్యాచ్‌లో పసికూన విజయానికి కారణమయ్యాడు.

సూపర్‌-12 సమరంలో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌తో మజా మరో స్థాయికి చేరింది. కానీ ఇప్పుడు మ్యాచ్‌లకు అంతరాయం కలిగిస్తూ వరుణుడు అభిమానులను నిరాశలో ముంచెత్తుతున్నాడు. సెమీఫైనల్‌ రేసులో ఉన్న పెద్ద జట్లకు వర్షం పెద్ద పరీక్షనే పెట్టింది. ముఖ్యంగా గ్రూప్‌-1లో..! ఈ గ్రూప్‌లో చిన్న జట్లయిన ఐర్లాండ్, అఫ్గానిస్థాన్‌లపై గెలిచి పాయింట్లతో పాటు నెట్‌ రన్‌రేట్‌ పెంచుకోవాలని న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా భావించాయి. కానీ ఇప్పుడు అందులో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌కు ఓ అవకాశం చేజారింది.

తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి జోరుమీదున్న న్యూజిలాండ్‌కు.. అఫ్గాన్‌ను ఓడించడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. కానీ ఆ జట్టుతో పాయింటు పంచుకోవాల్సి వచ్చింది. ఇక ఐర్లాండ్‌తో ఛేదనలో తడబడ్డా.. చివర్లో వేగం పుంజుకున్న ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ సాగితే నెగ్గేదేమో! అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తూ, టైటిల్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న ఆ జట్టుకు ఈ ఓటమి నష్టం చేసేదే. కివీస్‌ చేతిలో ఓడి పట్టికలో అయిదో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు ప్రతి మ్యాచ్‌ కీలకమే. ఇప్పుడు ఐర్లాండ్‌ చేతిలో పరాజయంపాలైన ఇంగ్లాండ్‌కు అదే పరిస్థితి ఎదురైంది.ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో ఓడిన జట్టుకు సెమీఫైనల్‌ అవకాశాలు దాదాపుగా మూసుకుపోవడం ఖాయం.

వాన కారణంగా గ్రూప్‌-2లో జింబాబ్వేతో మ్యాచ్‌లో మెరుగైన స్థితిలో ఉన్నా దక్షిణాఫ్రికా పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. టోర్నీలో ఇంకా ఎన్ని మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తుందో..! భారత్, పాక్‌ పోరుకు కూడా ముందు వర్షం ముప్పు ఉందనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మెరుగుపడడంతో మ్యాచ్‌ సజావుగా సాగి గొప్ప కిక్కును అందించింది. ఇలాంటి ఆసక్తికర పోరాటాలు మరిన్ని చూడాలంటే వర్షం దయ తలచాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.