ETV Bharat / sukhibhava

'బెడ్' అలా లేకపోతే ఇన్ని సమస్యలా!

ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా బెడ్​పై సేదతీరుతాం. అప్పుడప్పుడు మంచంపైనే కూర్చుని తింటాం. కానీ.. ఇది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు బ్రిటన్​కు చెందిన ఓ సూక్ష్మజీవుల నిపుణుడు. బెడ్​పై వేలకొద్దీ బ్యాక్టీరియా దాగి ఉంటుందని అధ్యయనం చేసి, తేల్చారు. వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో వివరించారు.

sleeping beds
బెడ్, పడక
author img

By

Published : Jul 18, 2021, 6:09 PM IST

చాలా మందికి నిద్రే బంగారం. లేస్తూనే.. 'అప్పుడే తెల్లారిపోయిందా' అనుకునే వాళ్లు ఎందరో! నిద్రించే సమయంలో.. బెడ్​పై పడుకుని దొర్లుతూ ఉంటారు కొందరు. దిండును హత్తుకుని పడుకునేవారు ఇంకొందరు. బెడ్​ షీట్​ను చుట్టుకుని కలల ప్రపంచంలోకి జారుకునే వారు మరికొందరు. అయితే..​

మనం ఊహించినంత నీట్​గా 'బెడ్'​ ఉండదనే విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదని ఓ అధ్యయనంలో తేల్చారు లండన్​కు చెందిన ఓ మైక్రోబయాలజిస్ట్.

చెమట, ఉమ్ము, డాండ్రఫ్, మృత చర్మ కణాలు, ఆహార పదార్థాలు మొదలైనవి బెడ్​పై ప్రమాదకరజీవుల్లా మారుతాయని సూక్ష్మజీవుల నిపుణుడు చెప్పారు. వీటి కారణంగా బెడ్​పై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్​ వ్యాప్తిచెందుతాయని వివరించారు.

బ్యాక్టీరియా..

బెడ్​షీట్లపై వేలకొద్దీ బ్యాక్టీరియా దాగి ఉంటుంది. ఓ ఆసుపత్రిలోని బెడ్​షీట్లపై నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా.. బెడ్​షీట్లపై అధికంగా ఉన్నట్లు వారు గుర్తించారు.

స్టాఫిలోకొక్కస్ ప్రమాదకర బ్యాక్టీరియా కాదు. కానీ.. చర్మంపై గాయాలైన చోట నుంచి ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి.

స్టాఫిలోకొక్కస్ ఆరియస్- స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా జాతిలో ఇది చాలా ప్రమాదకారి. దీని వల్ల చర్మ వ్యాధులు, నిమోనియా, మెటిమలు తీవ్రమవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.

ఈ కొలి బ్యాక్టీరియా(E. Coli)- ఈ రకం బ్యాక్టీరియా కూడా ఆసుపత్రి బెడ్లపైనే ఎక్కువగా ఉంటుంది. దీన్ని గ్రామ్​ నెగటివ్ బ్యాక్టీరియా అని కూడా ఉంటారు. ఈ బ్యాక్టీరియా వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు, నిమోనియా, డయేరియా, నాడీమండల పటలశోథ(meningitis), సెప్సిస్(sepsis) మొదలైన వ్యాధులు సంక్రమిస్తాయి.

ఈ కొలి బ్యాక్టీరియా స్ట్రెయిన్లు మరింత ప్రమాదకరమని నిపుణులు అధ్యయనంలో తేల్చారు.

పురుగులు(Bugs)

నిద్రిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి సాధారణంగా 500 మిలియన్ల చర్మ కణాలు బెడ్​పై పడతాయి. నల్లులు వీటిని ఆహారంగా సేవిస్తాయి. ఈ పురుగులు వదిలే వ్యర్థాల ద్వారా అలర్జీ, ఆస్తమా వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది.

బెడ్​పై ఉండే ఈ పురుగులు ద్వారా.. చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఒత్తిడి, నిద్రలేమి, అలర్జీ వంటి మానసిక సమస్యలకు ఇవి కారణం అవుతాయి.

బట్టలు, బ్యాగుల ద్వారా నల్లులు(bed bugs) ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంది. ఈ కీటకాలను అంతం చేయాలంటే.. బెడ్​షీట్లను ఉతికి అధిక ఉష్ణోగ్రత(55 డిగ్రీల సెంటిగ్రేడ్)లో ఆరబెట్టాలి.

సూక్ష్మజీవులు(Household germs)

పరిశుభ్రంగా లేని వస్తువుల ద్వారా సూక్ష్మజీవులు బెడ్​పైకి చేరతాయి. బట్టలు, టవల్స్, కిచెన్​లోని వస్తువులు, పెంపుడు జంతువుల ద్వారా సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. బాత్​రూమ్, కిచెన్ టవల్స్​ ద్వారా ఎస్ ఆరియస్, ఈ కొలి బ్యాక్టీరియాలు ఎక్కువగా వ్యాపిస్తాయి.

  • బట్టలు సరిగ్గా ఇస్త్రీ చేయకపోయినా రోగాలు వచ్చే ప్రమాదముంది. అపరిశుభ్రమైన బెడ్​షీట్స్, టవల్స్​ ద్వారా సెగరోగం(gonorrhoea) వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • ఇన్​ఫ్లూయెంజా వైరస్​లు బట్టలపై 8-12 గంటల వరకు బతికి ఉంటాయి. వ్యాక్సీనియా వంటి ఇతర వైరస్​లు ఉన్ని, కాటన్ దుస్తులపై 14 వారాల పాటు జీవిస్తాయి. వీటి వల్ల కూడా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి.

బెడ్​ను పరిశుభ్రంగా ఉంచుకునేదెలా?

  • బట్టలు, బెడ్​షీట్​లు రెగ్యులర్​గా, సరిగ్గా ఉతకడం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను అంతం చేయొచ్చు. రోజూ బెట్​షీట్​లను ఉతకలేం కాబట్టి వాటిని ప్రతి ఉదయం గాలికి ఆరబెట్టాలి.
  • కనీసం రెండు వారాలకోసారైనా బెడ్​షీట్లు శుభ్రం చేసుకోవాలి. బెడ్​ పరిసరాలను వ్యాక్యూమ్​ క్లీనింగ్​ ద్వారా రోజూ శుభ్రపరుచుకోవడం మంచిది.
  • నగ్నంగా నిద్రించేవారు, ఎక్కువ సమయం బెడ్​పైనే గడిపేవారు, ఎక్కువ చెమట వచ్చేవారు వారానికోసారి బెడ్​షీట్లను తప్పనిసరిగా ఉతకాలి. రెండు, మూడు రోజులకు దిండు కవర్​లను మార్చాలి.
  • పడుకునేముందు స్నానం చేయడం, చెమటలు పడుతుండగా బెడ్​పై కునుకు తీయడం, బెడ్​పై కూర్చుని లోషన్స్, ఆయిల్​ మొదలైనవి అప్లై చేయడం మంచిదికాదు.
  • పెంపుడు జంతువులను బెడ్​లకు దూరంగా ఉంచాలి.
  • బెడ్​పై ఆహారం, పానీయాలు సేవించరాదు.

ఇదీ చదవండి:పొట్టలోని బ్యాక్టీరియా వల్లే.. చిన్నవయస్సులో అనారోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.