ETV Bharat / sukhibhava

ఈ యోగాసనాలతో గ్యాస్ ట్రబుల్ మాయం! - ఏక పాద బద్ధ మలాసనం

యోగా మన నిత్య జీవితంలో ఒక భాగమైతే అనేక జబ్బులను సులభంగా నివారించవచ్చు. కడుపులో మంట, ఉబ్బరం ఈ రోజుల్లో సాధారణంగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యలు. ఫ్యాక్టరీల్లో సిద్ధం చేసిన ఆహారం, ఎక్కువ నూనెతో కూడిన ఆహారం తినడం, నిద్రలేమి ఈ సమస్యలను కలగజేస్తున్నాయి. ఎటువంటి యోగాసనాలు ఈ సమస్యలను పరిష్కరించగలవో తెలుసుకుందాం.

Yoga Asanas
యోగాసనాలతో గ్యాస్ ట్రబుల్ మాయం
author img

By

Published : Mar 18, 2021, 5:06 PM IST

Updated : Mar 19, 2021, 10:09 AM IST

చిరుతిళ్లు, నూనె వస్తువులు, జంక్ ఫుడ్​గా పరిగణించే వాటిని తరచూ తినడం వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం కలగవచ్చు. ఇటువంటి ఆహారం.. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసి కడుపు నొప్పి, మలబద్ధకం, ఆకలి లేకపోవటం మొదలైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

క్రమం తప్పకుండా చేసే యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుంది. శరీర సౌష్ఠవాన్ని కాపాడుతూ, శరీర సామర్ధ్యాన్ని పెంచి, రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తూ దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. యోగాలో గ్రాండ్ మాస్టర్ అయిన అక్షర్.. కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణశక్తిని పెంచే 4 సరళమైన యోగాసనాల గురించి ఇలా వివరించారు.

వజ్రాసనం:

ఈ ఒక్క ఆసనం మాత్రమే భోజనం చేసిన తర్వాత చేయాలి.

ఆసనం ఎలా..

vajrasana
వజ్రాసనం
  • నిటారుగా రెండు కాళ్లపై నిలబడి నిదానంగా ఊపిరి తీసుకుంటూ వదలాలి.
  • కళ్లు మూసుకోవచ్చు.
  • చేతులను నిటారుగా కిందకు ఉంచాలి.
  • నిదానంగా కళ్లు తెరిచి నేల మీద కూర్చోవాలి.
  • కాలి వేళ్లు బయటకి ఉండేట్టుగా మడమలపై కూర్చోవాలి.
  • కాలి మడమలను దగ్గరగా ఉంచి, అరచేతులను మోకాళ్లపై ఆనించాలి.
  • వెన్నెముకను నిటారుగా ఉంచి ముందుకు చూస్తూ ఉండాలి.
  • కాసేపు ఈ ఆసనంలో గడపాలి.

మలాసనం:

ఆసనం ఎలా-

Malasan
మలాసనం
  • సమస్థితి నుంచి మోకాళ్లను వంచి నడుమును కిందకు తేవాలి.
  • రెండు పాదాలపై కూర్చొని ఉన్న స్థితికి చేరాలి.
  • రెండు మోకాళ్ల మధ్య కాస్త ఎడం ఉండాలి.
  • చేతులను చాచి మోకాళ్లపై ఆనించాలి.
  • వెన్నెముక నిటారుగా ఉండాలి.

ఏక పాద బద్ధ మలాసనం:

ఆసనం ఎలా-

Eka Pada Badha Malasana
ఏక పాద బద్ధ మలాసనం

  • కుడి చేతిని కుడి మోకాలు ముందు నుంచి వెనక్కి చాచాలి.
  • ఎడమ చేతితో వెనుక నుంచి కుడి చేతిని పట్టుకోవాలి.
  • వెన్నెముకను సాధ్యమైనంత నిటారుగా ఉంచాలి.
  • ఇదే ఆసనాన్ని మరో వైపు కూడా ప్రదర్శించాలి.

దండాసనం:

ఆసనం ఎలా-

Dandasana
దండాసనం
  • కాళ్లు చాచి నేలపై కూర్చోవాలి.
  • కాలి వేళ్లను సాధ్యమైనంత ముందుకు చాచాలి.
  • వెన్నెముక నిటారుగా ఉండాలి.
  • చేతులను నిటారుగా ఉంచి అరచేతులను నేలపై పూర్తిగా ఆన్చాలి.

యోగాసనాల వల్ల శరీరంలోని అన్ని అవయవాలు వాటి క్రియలను మెరుగుపరచుకుని విష పదార్థాలను బయటకు పంపుతాయి. జీర్ణమండల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా ఒక తిరుగులేని మార్గం.

Last Updated : Mar 19, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.