ETV Bharat / sukhibhava

ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట! - telugu health tips

కొన్ని సార్లు మనసంతా భారంగా, ఒంటరిగా అనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో కొన్ని మొక్కలు మన మూడ్‌ని ప్రభావితం చేయడమే కాదు.. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించి తిరిగి మనల్ని ఉత్సాహంగా మార్చేస్తాయట! ఇంతకీ ఆ మొక్కలేంటో తెలుసుకోవాలనుందా..? మరింకెందుకు ఆలస్యం.. పూర్తి కథనం చదివేయండి... మీ మూడ్​ మార్చేసుకోండి.

HEALTH STORY
ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!
author img

By

Published : Jul 12, 2020, 10:31 AM IST

Updated : Jul 12, 2020, 10:50 AM IST

వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితాల్లో భాగంగా మనకు అప్పుడప్పుడూ ఎదురయ్యే సమస్యలు మనలో మానసిక ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ సర్వసాధారణంగా మారిపోయాయి. అందుకే వీటి నుంచి బయటపడడానికి చాలామంది వ్యాయామం, ధ్యానం.. వంటివి చేయడంతో పాటు వారికి నచ్చిన పనులు చేయడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అనుసరిస్తున్నారు. అయితే ఇంట్లో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని మొక్కలు కూడా మనలో ఉండే మానసిక ఆందోళనల్ని దూరం చేస్తాయట...

wonder-plants-that-changes-your-mood
ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!

తులసి

wonder-plants-that-changes-your-mood
ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!

మన చుట్టూ ఉండే ఆకుపచ్చని మొక్కలు కంటికి ఇంపుగా కనిపించడమే కాదు.. వాటి నుంచి వెదజల్లే సువాసనలూ మనలోని ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాంటి వాటిలో మనం దైవసమానంగా పూజించే తులసి కూడా ఒకటి. దీనిలో ఉండే లినాలూల్ అనే సమ్మేళనం సువాసనల్ని వెదజల్లుతుంటుంది. దీన్ని పీల్చడం వల్ల ఎంత ఒత్తిడిలో ఉన్న వారైనా సరే.. కాసేపటికే ఉపశమనం పొంది తిరిగి సాధారణ స్థితికి రావాల్సిందే..! ఇలా తులసి మనలోని ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసి మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

రోజ్‌మేరీ

wonder-plants-that-changes-your-mood
ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!

ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా చాలామంది దీన్ని ఇంటి అలంకరణకు ఉపయోగిస్తుంటారు. ఇలా ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఈ మొక్క మానసిక సమస్యల్ని సైతం దూరం చేసి సానుకూల దృక్పథాన్ని పెంచుతుందట. కారణం దీన్నుంచి వెలువడే సువాసనే. అంతేకాదు.. దీని నుంచి తయారుచేసిన నూనెను సౌందర్యపరంగా ఉపయోగించడం, వంటకాల్లో వాడడం వంటివి మనకు తెలిసిందే. ఇలా ఇటు ఆరోగ్యాన్నీ, అటు అందాన్ని కూడా పెంపొందిస్తుందీ మొక్క.

గులాబీ

wonder-plants-that-changes-your-mood
ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!

'మీకు బాగా ఇష్టమైన పూలమొక్క??' అనగానే చాలామందికి ఠక్కున గుర్తొచ్చేది గులాబీనే! అందులోనూ అమ్మాయిలకు ఈ మొక్కంటే మరీ ఇష్టం. అందుకే ఇంటి గార్డెన్‌లో రంగురంగుల గులాబీ మొక్కల్ని నాటుతూ ఉంటారు. అయితే ఈ పూల మొక్కతో మనలోని ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయన్న విషయం మీకు తెలుసా..? అవునండీ.. ఈ మాట మేం చెబుతున్నది కాదు.. ఓ అధ్యయనంలో తేలింది. ఫిజియోలాజికల్ ఆంత్రోపాలజీ జర్నల్‌లో పేర్కొన్న ఓ అధ్యయనం ప్రకారం.. ఒత్తిడితో సతమతమవుతున్న వారు ఈ పూల మొక్కవైపు కాసేపు తదేకంగా చూస్తే చాలు వారి ఒత్తిళ్లన్నీ మాయమై మనసంతా సంతోషంతో నిండిపోతుందట. మరి, మీ మూడ్ కూడా సంతోషంగా మారిపోవాలా.. అయితే గులాబీ మొక్కపై మీరూ ఓ లుక్కేయండి.

లావెండర్

wonder-plants-that-changes-your-mood
ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!

పర్పుల్ కలర్‌లో కంటికి ఇంపుగా కనిపించే పూల మొక్క లావెండర్. చాలా అరుదుగా కనిపించే ఈ మొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఇది వెదజల్లే సువాసనలు మనలోని మానసిక ఆందోళనల్ని దూరం చేసి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. కాబట్టి ఇంత ఖరీదైన మొక్కను ఇంట్లో పెంచుకునే అవకాశం లేనప్పుడు లావెండర్ ఫ్లేవర్‌తో తయారుచేసిన సెంటెడ్ క్యాండిల్స్, రూమ్ ఫ్రెష్‌నర్స్.. మొదలైన వాటిని ఇంట్లో భాగం చేసుకోవాలి. తద్వారా కూడా ఆందోళనగా ఉన్నప్పుడు మన మూడ్‌ని సంతోషంగా మార్చుకునే వీలు ఉంటుంది.

ఇవి కూడా..

wonder-plants-that-changes-your-mood
ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!
  • ఇంట్లోని చెడు గాలిని బయటికి పంపి పరిశుభ్రమైన గాలిని అందించేందుకు కొందరు కొన్ని రకాల మొక్కల్ని ఇంటీరియర్స్‌లో భాగం చేసుకుంటారు. ఆర్కిడ్ పూల మొక్క కూడా ఆ కోవకు చెందినదే..! ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే ఈ పూల మొక్కను చూస్తే చాలు.. మనసులో ఉండే ఎంత తీవ్రమైన బాధైనా ఇట్టే మటుమాయం అయిపోతుందట!
  • ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగించే పీస్ లిల్లీస్ పూల మొక్క కూడా మన మనసులోని బాధల్ని దూరం చేయడంలో బాగా సహకరిస్తుంది. దీని నుంచి వెదజల్లే సువాసన వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాదు.. ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేయడానికీ దోహదం చేస్తుంది.
  • గార్డెన్‌లో ఎక్కువ మంది పెంచుకునే బోస్టన్ ఫెర్న్ గాలిని శుద్ధి చేయడంతో పాటు మనసుకు ఆహ్లాదాన్నీ పంచుతుంది.
  • గాలిని శుద్ధి చేసే ఇంగ్లిష్ ఐవీ మొక్కను చాలామంది ఎక్కువగా ఇంటీరియర్స్‌లో భాగంగా వాడుతుంటారు. తీగలా విస్తరించే ఈ మొక్కను గార్డెన్‌లో నాటుకొని రోజూ దీన్ని ఓసారి చూస్తే చాలు.. మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుందట!
  • ఎర్రెర్రని జెరానియం పూల మొక్కను చూస్తే మనసు ఆహ్లాదంతో నిండిపోవడమే కాదు.. దాని నుంచి వెలువడే సువాసనను పీల్చడం వల్ల మనసులోని ఒత్తిళ్లన్నీ హుష్‌కాకి అయిపోతాయంటే నమ్మండి.
  • తెల్లతెల్లని మల్లె మొగ్గల్ని తలపించే లిల్లీ ఆఫ్ ది వ్యాలీ, మల్లె, పొద్దుతిరుగుడు, చూడ్డానికి పేపర్‌లా కనిపించే రంగురంగుల స్వీట్ పీ.. వంటి పూల మొక్కలు వెదజల్లే వాసనల వల్ల కూడా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగే మనీ ప్లాంట్, కలబంద.. వంటి ఇంట్లో పెంచుకునే మొక్కల వల్ల కూడా మనసులోని బాధలు దూరమై పాజిటివిటీ పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళనలతో కూడిన మనసుని తిరిగి ఆహ్లాదం, ఆనందంతో నింపుకోవాలంటే ఎలాంటి మొక్కల్ని మన ఇంట్లో భాగం చేసుకోవాలో తెలుసుకున్నారు కదా! అయితే ఇంకెందుకాలస్యం.. మీరు కూడా వెంటనే వాటిని ఇంటికి తెచ్చేసుకొని ఆ మొక్కలను చూస్తూ, అవి వెదజల్లే సువాసనల్ని ఎంజాయ్ చేస్తూ రోజూ హ్యాపీగా గడిపేయండి..

ఇదీ చదవండి: అన్నం తిన్నంత మాత్రాన లావైపోతారా?

Last Updated : Jul 12, 2020, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.