పురుషుల్లో సెక్స్ పరంగా తలెత్తే రకరకాల సమస్యల్లో పురుషాంగం నొప్పి ప్రధానమైనది. క్రికెట్ ఆడేటప్పుడు అంగానికి బంతి తగిలినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అయితే ఇది తాత్కాలికమైనదని.. చాలా రోజుల పాటు ఆ ప్రాంతంలో నొప్పి అలాగే ఉందంటే బంతి తగలడం వల్ల మాత్రం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బంతి తగిలినప్పుడు వాపు లేదా రక్తం గడ్డకట్టడం వంటివి జరుగుతాయని.. కానీ ఇవన్నీ కొంత కాలం వరకే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలంగా నొప్పి ఉంటే దానికి వేరే కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అంగం వద్ద 'వేరికోసిల్' వంటిది వృద్ధి చెందడం.. అది బాగా పెరిగి గ్రేడ్2 , గ్రేడ్ 3, గ్రేడ్4 స్థాయికి చేరితే కనుక నరాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు ఆరోగ్య నిపుణులు. దీని వల్లే నొప్పి వస్తూ ఉంటుందని.. అంతే కానీ ఇతర కారణాలు ఏం కాదని పేర్కొన్నారు. ఇలాంటి వాటిలో చాలామంది సంప్రదాయ వైద్యాలను అనుసరిస్తారని.. అయితే డాక్టర్ను సంప్రదించడమే ఉత్తమమైన పరిష్కారమని చెబుతున్నారు. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా సమస్య ఏంటో తెలుసుకోవచ్చని సూచించారు.
ఈ సమస్య వల్ల పిల్లలు పుట్టకపోవడం, శృంగారానికి పనికిరాకపోవడం అంటూ ఏం ఉండదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: