ETV Bharat / sukhibhava

తెలుపు, గులాబీ రంగు జామ- ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది!

Pink Guava Vs White Guava : జామ కాయలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అందరికి తెలిసిందే. అయితే మనకు మార్కెట్లో తెలుపు, గులాబీ అంటూ రెండు కలర్లలో కనిపిస్తాయి. దీంతో చాలా మందికి ఈ రెండింటిలో ఆరోగ్యానికేది మంచిది? దేంట్లో ఎక్కువ పోషకాలుంటాయనే డౌట్​లు వస్తాయి. ఇంతకీ దేని వల్ల ఎక్కువ లాభాలో ఇప్పుడు చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 4:49 PM IST

Guava
Guava

White Guava Vs Pink Guava : ఆరోగ్యంగా ఉండడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వాటిల్లో ఉండే పోషకాలు, విటమిన్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఫ్రూట్స్ కాపాడతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా రోజువారి డైట్​లో ఎదో ఒక పండు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తారు. అదే విధంగా ఏ సీజన్​లో దొరికే పండ్లను ఆ టైమ్​లో తినడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు. అయితే ఈ సీజనల్ ఫ్రూట్స్(Seasonal Fruits)​లో రకరకాల పండ్లు ఉన్నాయి. అందులో జామ ఒకటి.

Guava Health Benefits : జామ(Guava) గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చలికాలంలో విరివిగా దొరికే సీజనల్ పండ్లలో ఇది అతి ముఖ్యమైనది. తక్కువ ధరకే లభించే ఈ పండు ఒక్క చలికాలమే కాదు.. మిగతా టైమ్​లోనూ లభిస్తోంది. కానీ, వింటర్​లో జామ ఉత్పత్తి మరింత ఎక్కువగా ఉంటుంది. తీపి, పులుపుల కలయికతో ఈ పండ్లు ప్రత్యేక రుచిని అందిస్తాయి. ఇకపోతే మనకు మార్కెట్లో తెల్ల జామ, పింక్ జామ అనే రెండు రకాలు లభిస్తుంటాయి. చాలా మందిలో అసలు సందేహం అప్పుడే మొదలవుతుంది. ఈ రెండింటిలో ఏవి తీసుకుంటే ఆరోగ్యానికి మంచివి? దేనిలో పోషకాలు ఎక్కువ? వాటికి రంగు ఏ విధంగా వస్తుంది? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..? అనే డౌట్లతో సతమతమవుతారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పోషకాలు సూపర్​: జామలో పోషకాలకు కొదువ లేదు. యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్, యాంటీ డయాబెటిక్, యాంటీ డయేరియా, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్, నియాసిన్, కాల్షియం, పొటాషియం, జింక్, కాపర్, కార్బోహైడ్రేట్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు జామలో సమృద్ధిగా లభిస్తాయి.

VARIETY BAJJIS: జామకాయ బజ్జీ తిన్నారా.. యాపిల్‌ బజ్జీ రుచిచూశారా.. ?

రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలివే : నార్మల్​గా లభించే తెల్లజామలో పిండిపదార్థం(స్టార్చ్​), చక్కెర, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో గింజలు ఎక్కువగా ఉండడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఆధికంగా లభిస్తాయి.

ఇక అదే పింక్ జామ విషయానికొస్తే.. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. కానీ, పింక్​ జామలో స్టార్చ్, చక్కెర.. తెల్ల జామ కంటే తక్కువ స్థాయిలో ఉంటాయి. విటమిన్ సి కూడా ఇందులో అధికంగా ఉండదు. అలాగే గులాబీ రంగులో లభించే జామలో విత్తనాలు చాలా తక్కువ ఉండవచ్చు లేదా అసలు లేకపోవచ్చు. అయితే పింక్ జామను నార్మల్​గా తినడం కంటే జ్యూస్​లా తీసుకుంటే మంచిది.

మరి పింక్ జామకు ఆ రంగు ఎలా వస్తుంది? మనకు మార్కెట్లో వివిధ కూరగాయలు, పండ్లు ఎరుపు, నారింజ, పసుపు కలర్​లో లభిస్తుంటాయి. అలా అవి వివిధ రంగులలో లభించడంలో సమ్మేళనాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. క్యారెట్​, టమాటాలకు ఎరుపు రంగును కెరోటినాయిడ్ వర్ణద్రవ్యం ఏ విధంగా అందిస్తుందో.. అలాగే పింక్ జామ లోపలి గుజ్జుకు కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్ సమ్మేళనాలు గులాబీ రంగును ఇస్తాయి. అదే తెల్లజామలో ఇవి తగినంత స్థాయిలో ఉండవు.

హెల్త్ బెనిఫిట్స్ :

  • జామపండులో డైటరీ ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకుంటే జీర్ణక్రియ రేటు పెరగడంతో పాటు మలబద్ధకం లాంటి సమస్యలు నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • అలాగే డైటరీ ఫైబర్ ఎక్కువ ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచుగా జామను తింటే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతారు.
  • ఇక జామలో ఉండే పీచు పదార్థం, పొటాషియం, సోడియం నిల్వలను బ్యాలెన్స్ చేస్తూ రక్తపోటును అదుపులో ఉండేలా చేస్తాయి.
  • అదేవిధంగా జామపండులో లభించే ట్రైగ్లిజరాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.
  • పీరియడ్స్ టైమ్​లో మహిళలు ఈ పండ్లను తింటే తిమ్మిర్లు, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • మీరు తరచుగా జామపండ్లను తినడం ద్వారా బరువును కంట్రోల్​లో ఉంటుంది. వెయిట్​ లాస్ అవుతారు. అలాగే క్యాన్సర్ రిస్క్ తగ్గడంతో పాటు.. ఇమ్యూనిటీ పవర్ పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ రెండింటిలో ఏది మంచిది: మార్కెట్​లో లభించే తెలుపు, గులాబీ రెండు రకాల జామ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఏది తిన్నా మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఇకపై మార్కెట్​కి వెళ్లినప్పుడు ఏ జామ కనిపించినా కొనుక్కోవచ్చు.

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినండి..

జుట్టు రాలుతోందా? అయితే జామకాయ మిల్క్​షేక్​ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.