గోధుమల్లో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ క్రియ పెంపొందిస్తుంది. బేకరీల్లో దొరికే అనారోగ్యకరమైన కేకుల కంటే, శుభ్రంగా ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా కేక్ ట్రై చేయండి..
కావాల్సిన పదార్థాలు
- గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు
- కోకో పౌడర్ – పావుకప్పు
- బేకింగ్ పౌడర్ – టీస్పూన్
- ఉప్పు – అరటీస్పూన్
- పంచదార – కప్పు
- నీళ్లు – కప్పు
- నూనె/ బటర్ – కప్పులో మూడోవంతు
- నిమ్మరసం లేదా వెనిగర్ – టేబుల్‌స్పూన్
తయారీ
ముందుగా ఓ బౌల్‌లో గోధుమ పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పును తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నూనె లేదా కరిగించిన బటర్, నిమ్మరసం లేదా వెనిగర్‌ని జత చేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కేక్ బ్యాటర్‌లా తయారుచేసుకోవాలి. చివరగా ఈ బ్యాటర్‌ని కేక్ మౌల్డ్స్‌లో పోసుకుని ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే యమ్మీ చాక్లెట్ కేక్ సిద్ధమైంది.
ఇదీ చదవండి: 'బనానా కుకీస్' ఇలా చేసుకుంటే బ్రహ్మాండమే!