గర్భం ధరించొద్దని(pregnancy loop) భావించేవారికి లూప్ మంచి సాధనం. దీన్ని ఐయూసీడీ (ఇంట్రాయూటెరిన్ కాంట్రాసెప్టివ్ డివైస్) అనీ అంటారు(IUD pregnancy). అంటే గర్భాశయంలో అమర్చే గర్భనిరోధక సాధనం అన్నమాట. దీని ప్రధానమైన పని అండం, వీర్యం కలవకుండా చేయటం. ఫెలోపియన్ ట్యూబ్‌ల నుంచి అండం కిందికి రావటాన్నీ ఆలస్యం చేస్తుంది. అండం గర్భసంచిలో(pregnancy prevention loop) కుదురుకోకుండానూ అడ్డుకుంటుంది. ఇలా ఫలదీకరణ జరక్కుండా, గర్భం ధరించకుండా కాపాడుతుంది. ఆంగ్ల అక్షరం 'టి'(loop pregnancy control) ఆకారంలో ఉండే ఇది చాలా చిన్న పరికరం. ప్లాస్టిక్‌తో తయారయ్యే దీనికి పల్చటి రాగితీగ చుట్టి ఉంటుంది. చాలామందికి ఇది వేసుకున్నట్టయినా అనిపించదు. లూప్ బయటకు వచ్చే అవకాశముంటే 2-3 నెలల్లోనే వస్తుంది.
కొందరికి లూప్ అమర్చిన తర్వాత నొప్పి ఉండొచ్చు(loop pregnancy side effects). దీనికి ప్రధాన కారణం గర్భసంచి కండరాలు పట్టేయటం. నొప్పి మందులు వేసుకుంటే ఇది రెండు మూడు రోజుల్లోనే కుదురుకుంటుంది. కొందరికి తెల్లబట్ట అయినా నెల తర్వాత తగ్గిపోతుంది. లూప్ మూలంగా నెలసరి ఎక్కువ రోజులు, ఎక్కువ రక్తస్రావం అవుతుందని, నొప్పి పుడుతోందని కొందరు అంటుంటారు. ఇదీ రెండు మూడు నెలల్లోనే తగ్గిపోతుంది. సాధారణంగా ఇలాంటి సమస్యలు మొదట్లోనే వస్తుంటాయి కాబట్టి ఎక్కువగా చింతించాల్సిన పనిలేదు. కాకపోతే లూప్(loop pregnancy) సరిగా ఉందో లేదో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. పరికరం చివర ఉండే నైలాన్ తాళ్లు జననాంగంలోకి జారి ఉంటాయి. వీటిని పట్టుకొని చూడటం ద్వారా లూప్ సరిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.
లూప్‌ను(loop pregnancy control) దీర్ఘకాలం వాడుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్పించుకుంటే సరిపోతుంది. అదీ నెలసరి వచ్చిన వెంటనే మార్పించుకోవాలి. ఆలస్యం చేయొద్దు. ఒకవేళ మీరు గర్భం ధరించాలని అనుకుంటే డాక్టర్‌తోనే లూప్‌ను తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతగా తీయటానికి ప్రయత్నించొద్దు. లూప్(IUD pregnancy test) తీయించుకున్నా గర్భం ధరించొద్దని అనుకుంటే ఆ వెంటనే ఇతరత్రా గర్భ నిరోధక పద్ధతులు పాటించాలి.
ఇదీ చూడండి: WEIGHT LOSS: నడవకుండా బరువు తగ్గేందుకు టిప్స్