ETV Bharat / sukhibhava

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - మీకు "బ్రెయిన్​ ఫాగ్"​ ఉన్నట్టే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 1:32 PM IST

What is Brain Fog: మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు సడన్​గా దాని మీద ఇంట్రస్ట్​ తగ్గిపోయిందా..? అలాగే చేస్తున్న పనికి సంబంధించి ఏ విషయమైనా మర్చిపోయారా..? అయితే మీరు బ్రెయిన్​ ఫాగ్​ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టే. అసలు ఈ బ్రెయిన్​ ఫాగ్​ అంటే ఏమిటి..? ఎందువల్ల వస్తుంది..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం..

What is Brain Fog
What is Brain Fog

How to Get Rid of Brain Fog: మానసిక గందరగోళం, ఏ విషయం పైనా స్పష్టత లేకపోవడం, పనులపై దృష్టి పెట్టలేకపోవడం, విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది.. ఇలాంటి స్థితిని బ్రెయిన్‌ ఫాగ్‌ అంటారు. అయితే.. బ్రెయిన్ ఫాగ్ అనేది మెడికల్ కండిషన్ కాదు. జ్ఞాపక శక్తి లోపించడం.. ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి వైఫల్యాల సమూహం. ఈ లక్షణాలు ఉన్నవారు.. ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో, దేన్నైనా గుర్తుకు తెచ్చుకోవడంలో, ఏకాగ్రత లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బంది పడతారు. మానసికంగా అలసిపోతారు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. శాశ్వతంగా ఉండిపోతాయనే ఆందోళన అవసరం లేదు.

కళ్లలో సమస్యలా? భవిష్యత్తులో ఇబ్బందులే - ఇలా కాపాడుకోండి!

ఎవరికి వస్తుంది? : బ్రెయిన్ ఫాగ్​.. పాఠశాలకు వెళ్లే పిల్లల నుంచి పెద్దవారి వరకు.. అన్ని వయసుల వారినీ ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో సేమ్ లక్షణాలు ఉండొచ్చు.. వేర్వేరుగా ఉండొచ్చు.అందులో కొన్ని..

  • ఏకాగ్రత తగ్గడం
  • జ్ఞాపక శక్తిని కోల్పోవడం
  • అస్పష్టమైన ఆలోచనలు
  • తీవ్రమైన అలసట
  • నిరుత్సాహంగా ఉండటం

నెలసరి ముందు సమస్యలా? ఈ టిప్స్​తో అన్నీ మాయం!

బ్రెయిన్​ ఫాగ్​ కారణాలు: దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని చూస్తే..

డిజిటల్​ పరికరాల ఉపయోగం: ప్రస్తుత కాలంలో డిజిటల్ పరికరాల వినియోగం అధికమైంది. దీంతో మెదడుకు పని చెప్పడం మానేశాం.. ఏ పని చేయాలన్నా వీటిపై ఆధారపడటం వల్ల మన ఆలోచన తీరు.. గుర్తుంచుకోగల సామర్థ్యం దెబ్బతింటుంది.

ఒత్తిడి: అధిక ఒత్తిడి బ్రెయిన్ ఫాగ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడుపై అధిక పనిభారాన్ని, పీడనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరగడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, మానసిక అలసట, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, కుంగుబాటుకు లోనుకావడం కూడా జరగవచ్చు. ఇది మీ మెదడు సరిగా పనిచేయక, ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది.

ఐస్​క్రీమ్ ఇలా లాగించేయండి - నో టెన్షన్!

నిద్రలేమి: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. మారిన జీవనశైలి, ఆహారం, ఉరుకుల పరుగల జీవితం వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. నిద్రలేమి సమస్య మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఏకాగ్రత తగ్గడంతోపాటు ఆలోచనలు మబ్బుగా మారతాయి. కాబట్టి ప్రతీరోజు రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయేందుకు ప్రయత్నించండి.

వైద్య కారణాలు: ఈ సమస్యకు కొన్ని వ్యాధులను కారణాలుగా చెప్పవచ్చు. అవి రక్తహీనత, డిప్రెషన్, మధుమేహం, మైగ్రేన్లు, అల్జీమర్స్, హైపోథైరాయిడిజం, లూపస్, అలాగే కొవిడ్​ 19 పరిణామాలు కూడా..

సైనస్​ ఇబ్బంది పెడుతోందా? ఈ ఆసనాలతో ఫుల్ రిలీఫ్​!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • మీ ఆహారంలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, B, C, D, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను క్రమం తప్పకుండా చేర్చండి.
  • మధ్యాహ్నం పూట కెఫిన్‌తో కూడిన పానీయాలు తీసుకోవద్దు.
  • మద్యం, ధూమపానానికి దూరంగా ఉండండి.
  • ప్రతిరోజూ 15 నిమిషాలు ఎండ తగిలే ప్రదేశంలో ఉండాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం..
  • కంటి నిండా నిద్ర..

వింటర్​ ఎఫెక్ట్​- జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? నో టెన్షన్​- వీటిని ట్రై చేయండి!

వేపాకులని లైట్ తీసుకుంటున్నారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.