ETV Bharat / sukhibhava

కరోనా కాలంలో జిమ్​కు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి! - ఫిట్​నెస్ టిప్స్

కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు జిమ్ సెంటర్లు మూత పడ్డాయి. ఆ తర్వాత తిరిగి వాటిని తెరిచినా.. చాలా మంది అక్కడికి వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జాగ్రత్తలు పాటించి జిమ్​లో కసరత్తులు ప్రారంభించండి.

gym
జిమ్
author img

By

Published : Sep 9, 2021, 7:32 AM IST

Updated : Sep 9, 2021, 10:07 AM IST

రాధ రోజూ ఇంటి దగ్గర్లో ఉండే జిమ్‌కు పిల్లలతోపాటు వెళ్లేది. అక్కడ ఓ అరగంట అందరూ కలిసి చిన్నచిన్న వ్యాయామాలు, యోగా చేసేవారు. కొవిడ్‌(Covid 19 India) ప్రభావంతో ఆమె జిమ్‌ మానేసింది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న ఈ సమయంలో తిరిగి పిల్లలను తీసుకుని జిమ్‌కు(Gym Uses) వెళ్లాలని ఉన్నా భయపడుతోంది. ఇటువంటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తక్కువని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అవేంటో చూద్దాం..

సిద్ధంగా..

పిల్లలను తీసుకెళ్లినప్పుడు ఇరుకుగా ఉండే జిమ్‌ కాకుండా, విశాలంగా బయటిగాలి లోపలికి వచ్చే సౌకర్యం ఉండేదాన్ని ఎంచుకుంటే మంచిది. వెళ్లేటప్పుడు వారికి మంచినీళ్ల సీసా, మాస్కు, తువ్వాలు, మ్యాట్‌, హ్యాండ్‌ గ్లవుజులు, శానిటైజర్‌ ఉంచిన బ్యాగు ఎవరిది వారికి అందించాలి. మీకూ విడిగా సిద్ధం చేసుకోవాలి. ఇతరుల వస్తువులు అడగకుండా, తమ వస్తువులనే వినియోగించుకోవాలని పిల్లలకు చెప్పాలి. జిమ్‌లో(Gym benefits) పాటించాల్సిన నియమాలను ముందుగానే వారికి నేర్పడం మంచిది.

సమయపాలన..

కేటాయించుకున్న సమయానికి జిమ్‌కు చేరుకోవాలి. ముందుగానే అక్కడకు వెళ్లి, జనం మధ్యలో ఉండకూడదు. అలా పది నిమిషాల ముందుగా వెళ్లినా, జిమ్‌కు బయట దూరంగా నిలబడటం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు కూడా మిగతా వారికి, మీకూ మధ్య కనీస దూరాన్ని పాటించాలి. ఈ అంశాన్ని పిల్లలకూ అలవడేలా చేయాలి. అప్పటివరకు మరొక వ్యక్తి వినియోగించిన జిమ్‌ సామాగ్రిపై బ్యాక్టీరియా, సూక్ష్మజీవులుండే ప్రమాదం ఉంది. వాటిని ముట్టుకునే ముందు చేతులకు, ఆ పరికరాలకు శానిటైజర్‌ రాయడం మర్చిపోకూడదు. ఆ తర్వాతే.. వ్యాయామాలు మొదలుపెట్టడం అలవాటు చేసుకోవాలి.

సూచనలు

జిమ్‌కు వెళ్లేటప్పుడు ధరించే మాస్కును వ్యాయామాలు మొదలుపెట్టే ముందు తీసేయాలి. ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు మాస్కు ఉంటే రక్తప్రసరణలో మార్పులొస్తాయి. ఆక్సిజన్‌ అందక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలకు లేదా మీకు కాస్తంత సుస్తీగా ఉందంటే జిమ్‌కు సెలవు పెట్టడం మంచిది.

ఇదీ చదవండి:

DON'T SKIP BREAKFAST: టిఫిన్‌ మానేస్తున్నారా... అయితే ఇవి తప్పవు!!

మూత్రాన్ని ఆపుకోలేకపోతున్నారా? సమస్య ఇదే..!

Last Updated : Sep 9, 2021, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.