ETV Bharat / sukhibhava

ఈ పొరపాట్లతో చర్మానికి చేటు! - చర్మ సమస్యలు పరిష్కారాలు

ఎండా, చలిగాలులు, వాతావరణంలోని తేమ, కాలుష్యం.. వీటన్నింటి ప్రభావానికి మొదట గురయ్యేది చర్మమే. ఎండ వల్ల చర్మం నల్లబడటం, దద్దుర్లు రావడం, మొటిమలు, పొడిబారటం.. ఇలా రకరకాలుగా చర్మం ఇబ్బందులకు గురవుతుంది. అయితే మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలో చూద్దామా..

what are the mistakes of skin care routine in our daily life
ఈ పొరపాట్లతో చర్మానికి చేటు!
author img

By

Published : Jan 10, 2021, 12:29 PM IST

చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనే క్రమంలో తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేసేస్తుంటాం. వాటివల్ల చర్మానికి నష్టాలే ఎదరవుతాయి. అందుకే మనం తరచూ చేసే పొరపాట్లు ఏంటో? వాటిని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • స్కిన్​కేర్ ఉత్పత్తులను చర్మతత్వానికి, అలాగే ఆయా కాలాలకు సరిపోయే విధంగా ఎంచుకోవాలి. చలికాలంలో చర్మానికి ఎక్కువ పోషణ అవసరమవుతుంది. అలాని ఈ కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారు హెవీ క్రీమ్స్​ను వాడొద్దు.
  • ఆయిలీ స్కిన్​ ఉన్నవారు ముఖంపై పేరుకున్న నూనెలను తొలగించుకోవడానికి తరచూ సబ్బును వాడతారు. ఇది పెద్ద పొరపాటు. సబ్బులోని రసాయనాలు చర్మం పీహెచ్​ స్థాయిలను తగ్గిస్తాయి. దాంతో ముఖంపై మొటిమలు వస్తాయి.
  • జిడ్డు కాంబినేషన్​ స్కిన్​ ఉన్నవారు నూనె ఆధారిత క్రీములను, ఫేషియల్​​ మసాజ్​ చేయించుకోవద్దు. ఇలా చేయడం వల్ల తైల గ్రంథులు మరింత ఉత్తేజితమై నూనెలను స్రవిస్తాయి. దాంతో చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు, వస్తాయి. కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవారు ఆయిల్​ ఫ్రీ మ్యాటీ మాయిశ్చరైజర్​, జెల్​ ఆధారిత సన్​స్క్రీన్​లాంటి నూనెరహిత ఉత్పత్తులను వాడాలి.
  • చాలామంది రాత్రిపూట ముఖానికి క్రీమ్​ రాసి అలానే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల పెద్ద ఉపయోగమేమీ ఉండదు. నిజానికి చర్మం తనకు కావాల్సిన పోషణను కొద్దిసేపటిలో గ్రహించేస్తుంది. రాత్రంతా క్రీమ్​ను ముఖానికి పట్టించి ఉంచడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి గాలి ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి క్రీమ్​ అప్లై చేసిన పదిహేను నిమిషాల తర్వాత దూదితో కంటికి కింద మిగిలిన క్రీమ్​ను తుడిచేస్తే సరిపోతుంది.
  • చర్మానికి గాఢమైన లోషన్స్​ను వాడకపోవడమే మంచిది. అలాగే ముఖాన్ని పదే పదే చేతులతో తాకొద్దు. ఎందుకంటే వాటిపై లెక్కకు మించి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇలా ప్రతిసారి ముఖాన్ని తాకడం వల్ల చర్మ సంబంధ సమస్యలు రావొచ్చు.

ఇదీ చూడండి:వ్యాయామంతో శరీరానికే కాదు.. మెదడుకూ లాభాలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.