ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రజల దృక్పథంలో (walking for weight loss) మార్పు వస్తోంది. బరువు సమతూకంలో ఉండాలని యువతే కాదు.. కాస్త వయస్సు పైబడిన వారు జిమ్ సెంటర్లు, మైదానాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే బరువు పెరిగినట్లు తెలియగానే మన మనసులో మెదిలే మొదటి ప్రత్యామ్నాయం నడక. కానీ నెలల పాటు వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదని తెగ బాధపడుతుంటారు చాలామంది. బరువు తగ్గడానికి నడక సరైన విధంగా చేయాలంటున్నారు డాక్టర్లు.
- వాకింగ్ చేసినా బరువు తగ్గట్లేదంటే సరైన విధంగా (walking for weight loss tips) వాకింగ్ చేయట్లేదని అర్థం. ఎక్సైజ్‌కు అవసరమైనంత బ్రిస్క్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
- ఎంతసేపు వాకింగ్ చేస్తున్నారనేది కూడా ప్రాధాన్యమైన విషయం. 10-15 నిమిషాల నడక బరువు తగ్గడానికి పనికిరాదు. 60-90 నిమిషాల ఎక్సైజ్ అవసరం.
- ప్రస్తుతం ఉన్న బరువును యథాతథంగా ఉంచుకోవాలంటే మాత్రం 45 నిమిషాల ఎక్సైజ్ అవసరం.
- వాకింగ్‌తో పాటు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు.
- సరైన విధంగా ఎక్సర్సైజ్, ఆహారం అలవర్చుకున్నా.. బరువు తగ్గకపోతే అప్పుడు సర్జరీ వైపు ఆలోచించాల్సి ఉంటుంది.
- 5-10 కేజీల బరువు అధికంగా ఉంటే సహజ (walking for weight loss plans) పద్ధతుల్లోనే బరువును తగ్గించుకోవాలి. అదే 20-30 కేజీల బరువు అధికంగా ఉంటేనే డాక్టర్‌ను సంప్రదించి సర్జరీ చేయించుకోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:వ్యాయామానికి సమయం లేదా.. అయితే ఇది మీకోసమే!