ETV Bharat / sukhibhava

బరువు తగ్గాలంటే కిచెన్‌లో ఈ మార్పులు తప్పనిసరి! - బరువు తగ్గడానికి పాటించాల్సి చిట్కాలు

Weight Loss Tips: అధిక బరువును తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. కొంత మంది వ్యాయామం చేస్తే మరికొంత మంది డైట్​ చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలంటే వీటితో పాటు వంటగదిలోనూ పలు మార్పులు చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో మనం కూడా తెలుసుకుందాం.

Weight Loss Tips
బరువు తగ్గాలంటే కిచెన్‌లో ఈ మార్పులు తప్పనిసరి
author img

By

Published : Jan 28, 2022, 7:16 AM IST

Weight Loss Tips: ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. ఇలా కారణమేదైనా ఇప్పుడు చాలామంది బరువు తగ్గడం పైనే దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల విషయంలో కచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు. అయితే బరువు తగ్గాలంటే వీటితో పాటు వంటగదిలోనూ పలు మార్పులు చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. తద్వారా నెలకు సుమారు కిలో చొప్పున బరువు తగ్గచ్చని మరో అధ్యయనం కూడా చెబుతోంది. ఇంతకీ ఏంటా మార్పులు? రండి.. తెలుసుకుందాం..!

  1. చిప్స్‌, స్నాక్స్‌, బిస్కట్స్‌, చిరుతిండ్లు.. వంటివి బయటి నుంచి తెచ్చుకొని కిచెన్‌లో కంటికి కనిపించేలా అమర్చుకోవడం చాలామందికి అలవాటు. దీనివల్ల పదే పదే వాటిని తినాలనిపించి.. బరువు పెరిగే అవకాశం ఉందంటోంది ఓ అధ్యయనం. కాబట్టి వాటిని కిచెన్‌లో నుంచి తొలగించడం మంచిది. అంతగా తినాలనిపిస్తే.. ఇంట్లో చేసుకున్న స్నాక్స్‌తో.. అదీ మితంగా తీసుకుంటూ మనసును తృప్తిపరచుకోవచ్చు. అలాగే కిచెన్‌ క్యాబినెట్స్‌లో ఉండే డబ్బాల్లో ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్స్‌, గింజలు.. వంటివి అమర్చుకోవడం మంచిది.
  2. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్‌, క్యాండీస్‌, బ్రెడ్‌.. వంటివి చాలామంది రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుకుంటారు. ఇలా అధిక క్యాలరీలుండే పదార్థాలు తీసుకోవడం వల్ల క్రమంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి బదులు క్యారట్‌, బీట్‌రూట్‌, ఆయా సీజన్లలో లభించే పండ్లు.. వంటివి ఫ్రిజ్‌లో కంటికి కనిపించేలా అమర్చుకోవాలి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా చక్కెర ఉపయోగించకుండా పండ్ల రసాలు తయారుచేసుకొని సీసాల్లో నిల్వ చేసుకుంటే కావాలనుకున్నప్పుడు తాగేయచ్చు.
  3. చిన్న ప్లేట్లలో భోజనం చేయడం వల్ల మితంగా ఆహారం తీసుకునే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నాయి. కాబట్టి వంటగదిలో ఇప్పటికే ఉన్న పెద్ద ప్లేట్లను దాచేసి.. వాటి స్థానంలో చిన్న చిన్న ప్లేట్లను అమర్చితే సరిపోతుంది.
  4. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, డైనింగ్‌ టేబుల్‌పై చిరుతిండ్లకు బదులుగా తాజా పండ్లను నింపిన బౌల్‌ ఒకటి అమర్చుకోవాలి. తద్వారా ఏదైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్‌ జోలికి వెళ్లకుండా నచ్చిన పండు తినేయచ్చు.
  5. కిచెన్‌లో కొలతల స్పూన్లు/కప్పులు వాడడం వల్ల వంటకాల్లో ఆయా పదార్థాల్ని మోతాదుకు మించి ఉపయోగించకుండా జాగ్రత్తపడచ్చు. బరువు అదుపులో ఉంచుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.
  6. అలాగే బయటి నుంచి తెచ్చుకునే సరుకుల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యావసరాలు మినహా.. అనవసర స్టఫ్‌ తెచ్చుకొని కిచెన్‌లో నింపేస్తే.. అటు కిచెన్‌ చిందర వందరగా మారుతుంది.. ఇటు వాటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బరువూ పెరుగుతాం.
  7. మాటిమాటికీ వంటగదిలోకి వెళ్లడమెందుకని.. చాలామంది పిల్లలు తాము ఎక్కువగా గడిపే హాల్‌, బెడ్‌రూమ్స్‌లోనే తమకు నచ్చిన స్నాక్స్‌కి సంబంధించిన ప్యాకెట్స్‌ని దాచుకుంటారు. ఇక ఆకలేస్తే వాళ్లకు అవే గుర్తొస్తాయి. ఈ అలవాటు కూడా దీర్ఘకాలంలో ఊబకాయానికి దారితీస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి తల్లులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని.. వారితో ఈ అలవాటును మాన్పించడం, ఆ చిరుతిండ్లను ఇంట్లోనే తయారుచేసి మితంగా వారికి అందించడం.. వంటివి చేయాలి.
  8. మనసుకు నచ్చిన సంగీతం తీసుకునే ఆహారాన్ని సంతృప్తిగా ఆస్వాదించేలా చేస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. అందుకే ఇష్టమైన పాటలు వింటూ.. అది కూడా కిచెన్‌లోనే భోంచేయమని చెబుతున్నారు నిపుణులు.

మరి, బరువు తగ్గాలన్న లక్ష్యంతో మీరు మీ కిచెన్‌లో ఎలాంటి మార్పులు చేసుకున్నారు? మాతో పంచుకోండి!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: వంటింటి దినుసులతో ఒమిక్రాన్‌ నుంచి ఉపశమనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.