WEIGHT LOSS TIPS: కొందరికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైమ్ కుదరదు. అలానే కొందరికి లంచ్ చేయడానికి సమయం ఉండదు. ఇలా ఈ రెండింటిని ఒకేసారి కలిపి చెయ్యడాన్నే బ్రంచ్(BRUNCH) అంటారు. ఈ పద్ధతిన పాశ్చాత దేశాలు అనుసరిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల టైం మిగులుతుంది. బరువును అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఈ బ్రంచ్లో ఉండేటట్లు చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్స్ ఆహారంలో ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మాంసాహారులు బ్రంచ్లో రొయ్యలను ఎంచుకోవడం ఉత్తమమని అంటున్నారు. అందులో ఉన్న పీచు పదార్థం శరీరానికి మేలు చేస్తుందని అంటున్నారు. బ్రంచ్లో చిప్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్... వంటి వాటి జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. మంచి మాంసకృత్తులు, పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోమంటున్నారు. బ్రంచ్ ఊబకాయం ఉన్న వారిలో కొవ్వు నిల్వలు తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే మధుమేహంతో బాధపడేవారికి బ్రంచ్ వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
అధిక క్యాలరీలు, కొవ్వులతో నిండి ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటికి బదులుగా తక్కువ క్యాలరీలు, పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చక్కెరలు, ఉప్పు తక్కువగా ఉన్న పండ్లు, తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువూ తగ్గవచ్చు.
-నిపుణులు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: ఎక్కువ కష్టపడొద్దు.. 'స్మార్ట్'గా బరువు తగ్గండిలా..