ETV Bharat / sukhibhava

సడెన్​గా బరువు తగ్గిపోతున్నారా? షుగర్ ఉన్నవారిలో ప్రోటీన్ లాస్​కు కారణం అదే!

శరీర బరువు తగ్గించుకునేందుకు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే, కొందరిలో మాత్రం బరువు తగ్గడం అనేది ఓ సమస్యగా మారుతుంది. ఒక్కసారిగా బరువు తగ్గిపోతూ ఉంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల యువతలో ఈ సమస్య వస్తుంటుంది. మరోవైపు, షుగర్ వ్యాధి ఉన్న కొందరిలోనూ ఇలాంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. అసలు దానికి కారణం ఏంటి? అకస్మాత్తుగా బరువు తగ్గకుండా ఉండాలంటే ఏంచేయాలి?

WEIGHT LOSS
WEIGHT LOSS
author img

By

Published : Feb 23, 2023, 6:57 AM IST

టీనేజ్​లో ఉండే యువతీ, యువకులకు తిండి మీద కన్నా ఇతర విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దీని వల్ల శరీరానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోకుండా స్నేహితులతో కలిసి చిరుతిళ్లు తినడం చేస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి మొగ్గుచూపరు. ఇలాంటి నేపథ్యంలో చాలామందిలో న్యూట్రిషియన్ డెఫిషియన్సీ సమస్య తలెత్తుతుంటుంది. దీంతో బరువు తగ్గుతూ ఉంటారు. అసలు న్యూట్రిషియన్ డెఫిషియన్సీ సమస్య అంటే ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం.

అప్పుడప్పుడే వయసుకు వచ్చే టీనేజ్ కుర్రాళ్లు, అమ్మాయిలు ఎక్కువగా సరదాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వారికి కనీసం సరైన ఆహారం తినాలనే ధ్యాస కూడా ఉండదు. వాళ్లు ఎంతకీ సరదాగా మిత్రులతో కలిసి షికార్లు చేయడం, బయట చిరుతిళ్లు తినడం అలవాటుగా ఉంటుంది. అలాంటి వారిలో సాధారణంగా కనిపించే సమస్య న్యూట్రిషియన్ డెఫిషియన్సీ. ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఏ పరీక్షలు చేస్తే యువతలో న్యూట్రిషియన్ డెఫిషియన్సీని గుర్తించవచ్చనే విషయాలు వెల్లడించారు.

'టీనేజ్​లో చిరుతిళ్లు తినే వాళ్లలో సాధారణంగా వచ్చే సమస్య న్యూట్రిషియన్ డెఫిషియన్సీ. అంటే మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందకపోవడం. దీనికి రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి సాధారణంగానే సరైన పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. లేదంటే తీసుకున్న ఆహారంలోని పోషకాలు పేగు ద్వారా రక్తంలోకి గ్రహించకపోవడం వల్ల కూడా జరిగి ఉండవచ్చు. పేగు లేదా జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్టును చేయిస్తుంటారు. దీని వల్ల రక్తకణాల సంఖ్య, సైజ్ సరిగ్గా ఉన్నాయా అని తెలుస్తుంది. విటమిన్ లోపం లేదంటే ఐరన్ లాంటి పోషకాల లోపం ఉందా అని తేలుతుంది. ఐరన్ లోపిస్తే రక్తం తగ్గడమే కాకుండా రక్తకణాల సైజ్ కూడా తగ్గుతుంది. అలాగే విటమిన్ బి12 లాంటివి ఏమైనా తగ్గుతున్నాయా అని గుర్తిస్తారు. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తుంటారు. దీని వల్ల రక్తంలో ప్రోటీన్లు ఎంత ఉన్నాయని చూస్తారు. అలాగే ఆల్బుమిన్ ఎంత ఉందని చెక్ చేస్తారు. ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ శరీరంలో ఏదైనా సమస్య వల్ల న్యూట్రిషియన్ డెఫిషియన్సీ తలెత్తినట్లు గుర్తిస్తే వైద్యులను సంప్రదించి, దానికి తగిన టెస్టులు చేయించి, మందులు తీసుకోవచ్చు.'
- డా. ప్రశాంత్ చంద్ర, జనరల్ ఫిజీషియన్

మూత్రం ద్వారా ప్రోటీన్లు బయటకు..
ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్తే కూడా బరువు తగ్గిపోయే సమస్య కొందరిలో తలెత్తుతుంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అసలు మూత్రంలో ప్రోటీన్లు ఎందుకు పోతాయి? ఒకవేళ అలా బయటకు పోయినా మళ్లీ బరువు పెరిగి సాధారణ స్థితికి రావాలంటే ఏం చేయాలో నిపుణులు వివరిస్తున్నారు.

'చాలా సంవత్సరాలుగా షుగర్ ఉండే వారిలో ఇలాంటి సమస్య సాధారణంగా తలెత్తుతుంది. 7/8 సంవత్సరాల తర్వాత మూత్రపిండాల్లో వడపోతను ప్రభావితం చేస్తుంది. మామూలుగా అయితే ప్రోటీన్లు మూత్రపిండంలో వడపోత ద్వారా వేరవుతాయి. కానీ షుగర్ ఎక్కువ సంవత్సరాలు ఉండటం వల్ల ఈ ప్రక్రియలో అంతరాయం ఏర్పడి ప్రోటీన్లు వడపోతకు గురికావు. దీనిని వైద్యపరంగా డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఎక్కువ సంవత్సరాలు షుగర్​తో బాధపడే వారికి ఇది మామూలు సమస్య. కాకపోతే వ్యక్తులను బట్టి ఇది మారుతుంది. షుగర్ ఉన్న వారిలో ఇన్సులిన్ పని చేయదు కాబట్టి తీసుకున్న గ్లూకోస్ వినియోగం కాదు. దీంతో శరీరం నుండి గ్లూకోస్ వెళ్లిపోతుంది. దీని వల్ల శరీరంలోని ఫ్యాట్ కానీ మిగిలిన శక్తి నిల్వలు ఖర్చు అవుతాయి. ఫలితంగా శరీరం క్యాలరీలు కోల్పోయి బరువు తగ్గడం జరుగుతుంది' అని వైద్యులు వివరిస్తున్నారు.

'నిజానికి ఇది బయపడాల్సిన విషయం కాదు కాకపోతే ప్రోటీన్లను కోల్పోవడం గురించి జాగ్రత్త పాటించాలి. ప్రోటీన్లలో యాంటీ బాడీలు ఉంటాయి, రోగ నిరోధక శక్తికి ఇవి అవసరం. అలాగే ప్రోటీన్ల వల్ల రక్తనాళాల్లో నీరు ఉంటుంది. ప్రోటీన్ తగ్గితే రక్తనాళాల్లో నుండి నీరు బయటకు వస్తుంది. దీని వల్ల మొహం వాపు, కాళ్ల వాపు, శరీరం వాపునకు గురవుతాయి. అటు ప్రోటీన్ వెళ్లిపోవడం వల్ల శరీరం బలహీనపడుతుంది. నీరసంగా, చిన్న చిన్న ఇన్ ఫెక్షన్లు అన్నీ వస్తుంటాయి. దీనిని నివారించడాలంటే ముందు నుంచి షుగర్​ను నియంత్రించుకోవాలి. తక్కువ స్థాయిలో ప్రోటీన్ యూరియా ఉంటే అధిక స్థాయి ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని రెడ్ మీట్ లాంటి వాటిని తీసుకోకూడదు. కొన్ని రకాల మందులను ప్రారంభంలో వాడటం వల్ల నియంత్రించడానికి వీలవుతుంది. 6 నెలలు/ సంవత్సరానికి ఒకసారి యూరిన్ ప్రోటీన్ టెస్ట్ లేదా యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్ అనే టెస్ట్ చేయించుకోవాలి. దీని వల్ల ప్రోటీన్ లాస్ ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. వైద్యుల సలహాలు, వారిచ్చే మందులను వాడుతూ, శరీరానికి తగిన వ్యాయామం చేయడం, ఉప్పు తగ్గించడం లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు' అని ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర వివరించారు.

సడెన్​గా బరువు తగ్గిపోతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.