మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్యం బారిన పడుతోంది నేటి తరం. ఈ పరిస్థితి నుంచి ఇప్పటికే చాలా మంది తేరుకుని.. ఫిట్‌గా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజు వ్యాయామం, యోగా చేస్తున్నారు. వీటితో పాటు ఉదయపు నడక అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మందికి తాము ఎంత దూరం నడుస్తున్నామో ఓ లెక్క ఉండదు. అయితే, ఆ అడుగుల లెక్కను కొలిక్కి తీసుకొచ్చేందుకు ఈ విషయాలు తెలుసుకోండి..
ఇలా లెక్కించాలి..
ప్రస్తుత కాలంలో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాంటి వారందరూ తమ ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు రోజుకు 10 వేల నడవడానికి ప్రయత్నించవచ్చు. స్మార్ట్ వాచ్ ఉంటే ఈ అడుగుల లెక్కను తెలుసుకోవడం సులువే. అలా కాకుండా.. 10 వేల అడుగులు అంటే ఎంత దూరమో తెలుసుకోవచ్చా? ఇందుకో మార్గం ఉంది. ఈ అడుగుల లెక్కను ఓ ఫార్మూలాతో సులభంగా లెక్కించవచ్చు. మనం నడిచిన మొత్తం దూరం రావాలంటే.. మన స్ట్రైడ్(ఒక అడుగు వేస్తే ఎంత దూరం ముందుకు వెళ్లామో తెలిపే దూరం).. మనం వేసిన మొత్తం అడుగులతో గుణించాలి. అప్పుడు మనం మొత్తం ఎన్ని మైళ్లు నడిచామో తెలుస్తుంది.
దూరం(మైళ్లు) = అడుగు పొడవు x మొత్తం అడుగులు
అయితే, పెద్దవారి స్ట్రైడ్(అడుగు పొడవు) దాదాపు 64 నుంచి 76.2 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వీరి నడక సగటు వేగం 2 నుంచి 4 మైళ్లు( 3.2 నుంచి 6.4 కిలో మీటర్లు) వరకు ఉంటుంది. ఇక, వివిధ ఉపరితలాలను బట్టి వేగం మారుతుంది. అలా 10 వేల అడుగులు నడిస్తే 5 మైళ్లు(8 కిలో మీటర్లు) నడిచినట్లు అవుతుంది.
అడుగులతో.. ఆరోగ్య ప్రయోజనాలు?
రోజువారీ వ్యాయామాలతో పాటు.. నడక అలవర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రశాంతమైన నిద్ర, ఉత్సాహంగా ఉంటారు. హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. వాకింగ్, స్మిమ్మింగ్ లాంటివి చేయడం వల్ల హృదయ నాళాల, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది..
ప్రతిరోజు స్వచ్ఛమైన గాలికి సూర్యరశ్మిలో అలా కొద్దిసేపు నడిస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. - అల్జీమర్స్ వచ్చే అవాకాశం తగ్గుతుంది..
71 నుంచి 93 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ప్రతిరోజు కనీసం 0.3 కిలో మీటర్లు నడిచిన వారిలో.. అల్జీమర్స్ వచ్చే అవకాశం నడవని వారి కంటే తక్కువగా ఉందని వర్జీనియా యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. - గుండె జబ్బులకు దూరం..
ప్రతిరోజు నడిస్తే గుండె నాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా గుండె జబ్బులు, ఊబకాయం తదితర దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ తగ్గుతుంది. - కొవ్వు తగ్గుతుంది.. కండ పెరుగుతుంది..
ప్రతిరోజు నడిచి మనం తినేదాని కన్నా ఎక్కువ క్యాలరీలు కరిగిస్తే.. శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. కండరాలు గట్టిపడతాయి. - ఇవీ చదవండి :
- పీరియడ్స్ టైంలో సెక్స్ చేయకూడదా? ఎవరినీ ముట్టకూడదా?
- వక్షోజాలు బిగుతుగా మారాలా? ఈ 5 వ్యాయామాలు ట్రై చేయండి!