ETV Bharat / sukhibhava

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే! - హెయిర్​ ఫాల్​

Vitamin Deficiencies also Reason for Hair Fall: ప్రస్తుత రోజుల్లో హెయిర్​ ఫాల్​ కామన్​ అయిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చాలా మందికి తెలియని విషయం.. జుట్టు ఎక్కువగా రాలుతున్న వారిలో ఈ లోపాలు ఉన్నాయని. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Vitamin Deficiencies also Reason for Hair Fall

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 11:05 AM IST

Vitamin Deficiencies also Reason for Hair Fall: అందంగా కనిపించాలంటే ముఖవర్చస్సు ఎంతో ఇంపార్టెంటో.. మృదువైన, కోమలమైన జుట్టు కూడా అంతే ముఖ్యం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం.. దీనికి వయస్సు, జెండర్​తో సంబంధమే లేదు. కాగా, చాలా మంది జుట్టు ఊడటాన్ని తేలికగా తీసుకుంటారు. అదే పెరుగుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తారు. అసలు జుట్టు రాలడానికి కారణాలు అంటే ఇది అని చెప్పలేం.. కానీ, జుట్టు రాలడానికి ఉన్న ప్రధాన కారణాలలో విటమిన్ లోపాలు కూడా ముఖ్యమైనవని నిపుణులు అంటున్నారు. ఈ కింద విటమిన్లు లోపిస్తే జుట్టు రాలడమనే సమస్య ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఈ విషయంపై పలు అధ్యయనాలు కూడా స్పష్టతనిచ్చాయి.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

విటమిన్-డి: విటమిన్-డి లోపం జుట్టు చాలా పలుచగా మారడానికి దారితీస్తుంది. జుట్టు పెళుసుబారి తెగిపోతుంది. జుట్టు తొందరగా తెల్లగా మారడానికి కారణం అవుతుంది. దీన్ని రక్తపరీక్ష ద్వారా నిర్థారణ చేసుకోవచ్చు. చేపలు, గుడ్లలో పచ్చ సొన, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, లేత సూర్యరశ్మిలో గడపడం వల్ల విటమిన్-డి భర్తీ చేసుకోని.. తద్వారా మెరిసే జుట్టును పొందవచ్చు.

జుట్టు ఎక్కువగా రాలుతోందా? మీరు చేసే ఈ తప్పులే కారణం!

విటమిన్-ఇ: విటమిన్-ఇ లోపిస్తే తల చర్మం డెలికేట్​గా మారుతుంది. ఇది జుట్టు కుదుళ్లను, జుట్టు చివర్లను బలహీనం చేసి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్-ఇ తక్కువగా ఉంటే బట్టతల, పేనుకొరుకుడు సమస్యలు సులభంగా వస్తాయి. పాలకూర, బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవకాడో మొదలైన విటమిన్​ ఇ కలిగిన ఫుడ్స్​ తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.

విటమిన్-ఎ: విటమిన్-ఎ లోపం వల్ల జుట్టు పలుచగా మారుతుంది. తద్వారా విపరీతంగా రాలిపోతుంది. తిరిగి జుట్టు పెరగాలంటే టైమ్​ చాలా పడుతుంది. అదే విధంగా జుట్టులో చుండ్రు అధిక మొత్తంలో కనిపించడం వెనుక కారణం కూడా ఇదే. విటమిన్-ఎ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగానే బయటపడవచ్చు.

అది సాధారణ రోగం కాదు - క్యాన్సర్​ కావొచ్చు - ఇలా గుర్తించండి!

విటమిన్-సి: విటమిన్-సి లోపిస్తే జుట్టు పొడిబారడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, జుట్టు పెరుగుదల మందగించడం, పెళుసుగా మారడం జరుగుతుంది. విటమిన్​ సి అధికంగా ఉండే.. బ్రోకలీ, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు.. ఇలా మొదలగు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్-బి9: విటమిన్-బి9.. కణాల పెరుగుదలకు, కణాల విభజనకు సహాయపడుతుంది. ఇది లోపిస్తే కొత్త జట్టు ఉత్పత్తికి కావలసిన కణ విభజనను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా జుట్టు పెరుగుదల మందగిస్తుంది. ఆకుకూరలు, కాయధాన్యాలు, సిట్రస్ పండ్లు, బీన్స్ వంటి వాటి నుంచి ఫోలిక్ యాసిడ్ పొందవచ్చు.

ఐరన్: ఐరన్ లోపం వల్ల జుట్టు పల్చగా మారి రాలిపోతుంది. ఐరన్ సప్లిమెంట్లతో పాటూ పాలకూర, బీన్స్, బలవర్థకమైన కాయధాయన్యాలు, మునగాకు, రాగులు, నువ్వులు మొదలైనవి తింటూ ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..

మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

విటమిన్ బి12: ఈ విటమిన్​ లోపించడం వల్ల కూడా జుట్టు రాలడం మొదలవుతుంది. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు.. ఇలా మొదలగు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి రిలీఫ్​ పొందవచ్చు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి:

  • "జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎస్థటిక్ డెర్మటాలజీ" 2016లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. విటమిన్ బి12 లోపం జుట్టు రాలే సమస్యను పెంచుతుందని స్పష్టం చేసింది.
  • 2018 లో "బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. విటమిన్ డి లోపం జుట్టు రాలడానికి ప్రధాన కారణం అని కనుగొంది.
  • 2017 లో "స్కిన్ హెల్త్ అండ్ డిసీజ్"లో ప్రచురితమైన దాని ప్రకారం.. ఐరన్ లోపం అనేది జుట్టు రాలడానికి బాధ్యత వహించే అత్యంత సాధారణ న్యూట్రిషనల్ లోపాలలో ఒకటి అని నిర్ధారించింది.

డిప్రెషన్ ఒక ఊబి - స్విమ్మింగ్ పూల్​లా మార్చేస్తే పోలా!

మీరు నాన్ వెజ్​ తినరా? ప్రొటీన్స్​ కోసం ఏం తీసుకోవాలో తెలుసా?

న్యూ ఇయర్ తీర్మానం: మీ డైరీలో అవి ఉంటే - మీ డైట్​లో ఇవి ఉండాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.