Vitamin D Deficiency Foods to Eat : మన శరీరం ఆరోగ్యంగా ఉండటంలో, దానిలో జీవక్రియలు సరిగ్గా జరగడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ - ఏ, సి, డి, కే.. ఇలా ఏదైనా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇందులో డి విటమిన్ చాలా ముఖ్యమైంది. సహజ సిద్ధంగా సూర్యుడి నుంచి వస్తుంది. ఈ కాలంలో మాత్రల రూపంలోనూ లభిస్తుంది. విటమిన్ డి మనల్ని అనారోగ్యాల బారిన పడకుండా రక్షిస్తుంది.
అయితే.. ప్రపంపవ్యాప్తంగా అనేక మంది విటమిట్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇది ఈ కాలంలో ఒక సాధారణమైన సమస్యగా మారింది. సంక్లిష్టమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, రోజూ ఉదయం మన శరీరంపై తగినంత సూర్యరశ్మి పడేలా చూసుకోకపోవడం లాంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ లోపాన్ని రోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండటం వల్ల నివారించవచ్చు. లేదా ఈ 5 రకాల ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
1. ఆవు పాలు
ఆవు పాలలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తాగడం వల్ల చర్మంతో పాటు జుట్టూ ఆరోగ్యంగా ఉంటుంది. మీకు ముడి పాలు తాగడం ఇష్టం లేకపోతే.. వాటిని వేడి చేసుకుని తాగటం లేదా అందులో చాక్లెట్ సిరప్ లాంటివి వేసి తాగొచ్చు.
2. సిట్రస్ జ్యూస్
నారింజ పండ్ల రసాల్లో కావాల్సినన్ని పోషకాలుంటాయి. అందులో డి విటమిన్ కూడా ఉంటుంది. ఈ జ్యూస్‌ను బయట కొని తాగే కన్నా.. ఆ పండ్లతో ఇంట్లో మీరే తయారు చేసుకోవడం ఉత్తమం. ఇందులో ఉన్న విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలో సాయపడుతుంది.
3. సోయా మిల్క్
డి విటమిన్ అధిక శాతం జంతువుల నుంచి వచ్చే ఆహారాల్లో ఉంటుంది. మాంసాహారంతో పోలిస్తే.. శాకాహారంలో ఇది తక్కువగా ఉంటుంది. ఆవు పాలలో దొరికే విటమిన్ డి, ఇతర ముఖ్యమైన మినరల్స్ సోయా మిల్క్లోనూ లభిస్తాయి. కాబట్టి సోయా పాలు సైతం విటమిన్ డి ఉత్పత్తికి మంచి సోర్స్ అని చెప్పవచ్చు.
4. బటర్ మిల్క్
పెరుగు, యోగర్ట్, బటర్ మిల్క్ లాంటి పాల పదార్థాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని విటమిన్ లోపాన్ని... లస్సీ, రైతా తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. అంతేకాకుండా వేడి వాతావరణంలో పెరుగు, మజ్జిగ తాగటం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా అనేక వ్యాధులు రాకుండా కాపాడతాయి.
5. క్యారెట్ జ్యూస్
క్యారెట్ జ్యూస్ మన శరీరానికి జీవశక్తిని అందించటమే కాకుండా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేస్తుంది. ఇందులో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల, ఇది కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు విటమిన్ డి లోపం రాకుండా పోరాడుతుంది.
ఇవీ చదవండి : డి-విటమిన్ కోసం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసా?