ETV Bharat / sukhibhava

అమ్మమ్మ చిట్కాలూ.. జిందాబాద్..! - బ్యూటీ టిప్స్​

అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలు ఎంతో విలువైనవి. మనం గమనిస్తే.. ఇప్పటికీ వారి జుట్టు దృఢంగానే ఉంటుంది. ముదిమి మీద పడినప్పటికీ శరీరఛాయ మాత్రం మిసమిసలాడిపోతుంది. దీనంతటికీ కారణం వారు పాటించే సహజసిద్ధ సౌందర్య చిట్కాలే.. ఇప్పటిలాగా అప్పట్లో మార్కెట్లో లెక్కకు మిక్కిలి సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో లేవు కదా..! అందుకే వాళ్లు అలా చేశారు.. ఇప్పుడు మనకి ఆ అవసరం లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నట్లే. ఎందుకంటే బామ్మల నాటి చిట్కాల వల్ల మన సౌందర్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అందుకే ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..

అమ్మమ్మ చిట్కాలూ.. జిందాబాద్..!
అమ్మమ్మ చిట్కాలూ.. జిందాబాద్..!
author img

By

Published : Feb 12, 2021, 4:42 PM IST

'ముఖం చూడు ఎంత నల్లగా తయారైందో.. కాస్త పసుపు రాసుకోకూడదటే..' 'ఇదుగో ఈ మెంతుల పేస్ట్ తలకు రాసుకో.. జుట్టురాలడం ఆగిపోతుంది..' 'ఒంటికి నలుగుపిండి పెట్టుకున్నావంటే చాలు.. చర్మం సుకుమారంగా తయారవుతుంది..' 'ఆ షాంపూ వాడతావెందుకే.. జుట్టు రాలిపోతుంది.. చక్కగా కుంకుడు కాయలతో తలంటుకోవచ్చుగా..' అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలు వినే ఉంటారు. బామ్మల నాటి చిట్కాల వల్ల మన సౌందర్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అందుకే ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..

మెంతులు
పసుపు

పసుపు..

సాధారణంగా అమ్మాయిలకు ఎక్కువగా ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకోమని చెబుతూ ఉంటారు మన అమ్మమ్మలు, బామ్మలు. అయితే దాన్ని మనం నవ్వుతూ కొట్టిపారేస్తాం.. 'ఈ కాలంలోనూ పసుపు రాసుకోవడమేంటి బామ్మా..!' అంటుంటాం. కానీ పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమల సమస్య రాకుండా కాపాడతాయి. అలాగే చర్మంపై ఏర్పడిన మచ్చలు, గీతలను కూడా తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా.. మేనిఛాయ సైతం మెరుగు పడుతుంది.

బంగాళాదుంప..

నిద్ర తక్కువైనా.. కళ్లు ఒత్తిడికి గురైనా.. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అంతేకాదు.. కళ్లు ఉబ్బినట్లుగా కూడా కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మన అమ్మమ్మలు 'బంగాళాదుంపని చక్రాల్లా సన్నగా కోసి.. వాటిని కళ్లపై పెట్టుకో అమ్మాయ్' అని చెబుతూ ఉంటారు. ఐదు నుంచి పదినిమిషాలు ఇలా ఉంచడం ద్వారా కళ్లను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అంతేకాకుండా.. బంగాళాదుంపతో తయారుచేసుకున్న ఫేస్‌ఫ్యాక్స్ వేసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని సైతం కాపాడుకోవచ్చు. దీనిలో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. బంగాళాదుంపలోని పోషకాలు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. పైగా మచ్చలను సైతం తొలగిస్తాయి.

మెంతులు
మెంతులు

మెంతులు..

జుట్టు రాలడం లేదా చుండ్రు సమస్య ఉన్నప్పుడు మెంతులతో హెయిర్‌ప్యాక్ వేసుకోమని చెబుతూ ఉంటారు మన బామ్మలు. గుప్పెడు మెంతులని రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి.. మరుసటి రోజు మెత్తగా రుబ్బి తలకు ప్యాక్‌లా వేసుకోవడం ద్వారా కుదుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. బామ్మల కాలంలో ఎక్కువగా పాటించిన సౌందర్య చిట్కాల్లో ఇది కూడా ఒకటి. అందుకే ఇప్పటికీ చాలామంది బామ్మల వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా ఉంటాయి. మెంతుల్లోని పొటాషియం చిన్నవయసులో వచ్చే తెల్లజుట్టు సమస్యను రాకుండా చేస్తుంది. ఇందులోని లెసిథిన్ జుట్టు దృఢంగా అయ్యేలా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెంతుల్లోని నికోటిన్ యాసిడ్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అంతేకాదు.. దీనిలోని ఔషధ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి.

నలుగుపిండి..

పండగలకు, పబ్బాలకు నలుగుపిండితో స్నానం చేయడం అందరికీ తెలిసిన విషయమే. శెనగపిండి, పెసరపిండి, పసుపు వంటి పదార్థాలను మిశ్రమంగా చేసి దీన్ని తయారుచేస్తారు. ఒకప్పుడు మన బామ్మలు స్నానానికి సబ్బుకి బదులుగా నలుగుపిండినే ఉపయోగించేవారు. దీంతో వారి చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. నలుగుపిండితో చర్మాన్ని రుద్దుకోవడం వల్ల మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. శరీరంపై చేరిన మురికి కారణంగా మూసుకుపోయిన చర్మగ్రంథులు తెరుచుకుంటాయి. చర్మానికి రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. పైగా ఇందులోని పోషకాలు చర్మంలోని తైలగ్రంథులు విడుదల చేసే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అలాగే దీనిలో మనం ఉపయోగించే పసుపు అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది. కాబట్టి పండగల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లోనూ సబ్బుకు బదులుగా నలుగుపిండి ఉపయోగించడానికి ప్రయత్నించండి.

పాలు
పాలు

పాలు..

ఒకప్పుడు మన బామ్మలు, అమ్మమ్మలు చర్మం పగలకుండా ఉండేందుకు పాలు, పాల పదార్థాలను ఉపయోగించేవారు. ముఖ్యంగా చలికాలంలో పగిలిన చర్మానికి రోజూ తాజావెన్నను రాసేవారు. ఇది చర్మాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడంతో పాటు పోషణనిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాలమీగడ సైతం వాడేవారు. ఇది మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పగిలిన పెదవులకు నెయ్యి రాసుకొనేవారు. ఇది లిప్‌బామ్‌లా పనిచేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి పాలు, పెరుగు నలుగుపిండిలో కలిపి రుద్దుకొనేవారు. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు తగిన పోషణ సైతం అందుతుంది.

కుంకుడు కాయలు..
కుంకుడు కాయలు..

కుంకుడు కాయలు..

ప్రస్తుతం మార్కెట్లో వివిధ సంస్థలకు చెందిన షాంపూలు దొరుకుతున్నాయి. కొన్ని కంపెనీలైతే.. మా షాంపూలో కుంకుడు కాయలు ఉపయోగించాం అని ప్రకటనలు కూడా గుప్పిస్తుంటాయి. వాటిని చూస్తున్నప్పుడు కుంకుడుకాయల్లో ఇన్ని ప్రయోజనాలున్నాయా? అనిపిస్తుంది కూడా. కుంకుళ్లను సహజసిద్ధమైన షాంపూగా చెప్పుకోవచ్చు. ఇవి జుట్టును శుభ్రపరచడంతో పాటు.. కండిషనర్‌గా కూడా పనిచేస్తాయి. అలాగే జుట్టు రాలడాన్ని సైతం నిరోధిస్తాయి. దీనిలోని ఔషధ గుణాలు చుండ్రుతో పాటు ఇతర సమస్యలు రాకుండా చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్నాయి కాబట్టే.. మన పూర్వీకులు తలను శుభ్రం చేసుకోవడానికి కుంకుళ్లనే ఉపయోగించేవారు.

చూశారుగా.. మన బామ్మలు, అమ్మమ్మలు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో.. మరి, మీరూ ఇకపై ఈ నేచురల్ ఉత్పత్తులనే ఉపయోగిస్తూ మీ అందాన్ని కాపాడుకోండి.

ఇదీ చూడండి: సుందరం.. భక్తిపారవశ్యం... యాదాద్రి పుణ్యక్షేత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.