ETV Bharat / sukhibhava

కరోనా వల్ల కొత్త సమస్య.. పెరుగుతున్న నిద్రలేమి బాధితులు - Sleeping disorder increased by lockdown

ఎంతో మందిని కబళించి, మరెంతో మందిని బాధితులుగా మార్చిన కరోనా వల్ల మరో చిక్కొచ్చి పడింది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలకు కంటి మీద కునుకు కరవైంది. అందుకే కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నిద్ర లేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య మరింత పెరిగినట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ అంశాలపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు ప్రముఖ వైద్య నిపుణలు మన్వీర్​ భాటియా​. సమస్యను ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశారు.

There is an upward trend of sleep disorder as the fear for the pandemic grows, neurologist
కరోనా భయం: ఆ వయసు వారిలోనే నిద్రలేమి సమస్య అధికం
author img

By

Published : Jun 11, 2020, 10:37 AM IST

మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కీలకం. సరిపడా నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే ఈ సమస్యతో అనేకమంది బాధపడుతున్నారు. ఇప్పుడు దీనికి కరోనా తోడయింది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజలకు కొవిడ్​ దెబ్బకు నిద్ర దూరమైంది. ఇక లాక్​డౌన్​ విధించిన ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందట. ఈ క్రమంలో నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్న బాధితులు పెరిగినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతుననట్లు స్పష్టం చేశారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలిపారు.

నిద్రలేమి సమస్య ఎందుకు తలెత్తుతుంది? ఎలా మొదలవుతుంది? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? వంటి అనేక అంశాలపై అనుమానాలు నివృతి చేశారు డైరెక్టర్ స్లీప్​ మెడిసన్​, సీనియర్ న్యూరాలజిస్ట్​ డా.మన్వీర్​ భాటియా.

"నిద్రలేమితో బాధపడుతున్న అన్ని వయసుల మహిళలు, పురుషులతోనూ నేను మాట్లాడాను. ఈ రుగ్మతకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీనికి అనేక కారణాలుంటాయి. లాక్​డౌన్​ వల్ల ఉద్యోగంపై అభద్రత భావం, కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరులపై ఆందోళన, అమితంగా ప్రేమించే వారి ఆరోగ్య భద్రత వంటివి కారణాలు నిద్రలేకుండా చేస్తాయి. ఒత్తిడి పెరిగే కొద్ది శరీరంలో హార్మోన్లు విడుదలై నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఇతరుల వల్ల తమకు కరోనా సోకుతుందనే భయం కూడా ఈ సమస్యకు ఓ కారణం కావొచ్చు."

-మన్వీర్​ భాటియా, న్యూరాలజిస్ట్​

పిల్లలోనే అధికంగా..

"అన్ని వయసుల వ్యక్తుల్లోనూ నిద్ర రుగ్మతలు కనిపిస్తాయి. అయితే మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గమనించాను. కొవిడ్​-19 గురించి వస్తున్న వార్తలను ఇంటర్నెట్​లో చూసి భయాందోళనకు గురికావడమే పిల్లల్లో ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. నిద్ర నుంచి మేల్కొన్నప్పడు నీరసంగా ఉండటం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలను ముఖ్యంగా ఎదుర్కొంటున్నారు" అని భాటియా వివరించారు.

నిద్రలేమి మూడు ప్రధాన కారణాలు..

  1. మొబైల్​, లేదా కంప్యూటర్​ స్క్రీన్​​ అతిగా చూడటం వల్ల మెలటోనిన్​ హార్మోన్ విడుదల ఆగిపోతుంది. ఇది మెదడుపై దుష్ప్రభావం చూపి నిద్రలేమికి కారణమవుతుంది. మెలటోనిన్​ నిద్ర రావడానికి సహాయపడుతుంది.
  2. ఆందోళన, వేదన, తీవ్ర ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్లు అధికంగా విడుదలై నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.
  3. ప్రజలు సరైనా దిన చర్య పాటించకపోవడం వల్ల రాత్రి వేళ నిద్రకు భంగం వాటిల్లుతుంది. స్వీయ నిర్బంధంలో ఒంటరి భావన నిద్రపై ప్రభావం చూపుతుంది.

ఈ సమస్యలను అధిగమించడానికి.. భాటియా సూచనలు

  • స్క్రీన్​ చూసే సమయం తగ్గించాలి.
  • సరైనా దినచర్యను పాటించాలి.
  • ఉత్సాహంగా ఉండటానికి వ్యాయామం చేయాలి. అయితే రాత్రి 7 గంటల తర్వాత కసరత్తులు చేయకూడదు.
  • కాఫీ, టీ వంటి పానియాలు రాత్రి పడుకునే ముందు తీసుకోకూడదు.
  • టీవీ చూడటం తగ్గించాలి.
  • విశ్రాంతి తీసుకొనే చిట్కాలు పాటించాలి.

ఇదీ చూడండి: 'శరవేగంగా రామాలయ నిర్మాణం- 3 ఎకరాల భూమి చదును'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.