ETV Bharat / sukhibhava

ఫిట్​నెస్​తో పిల్లలకు.. పరీక్షల్లో మార్కులు

పిల్లలు రోజూ క్రమంతప్పకుండా పరుగెత్తితే.. చదువుల్లోనూ బాగా రాణిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. పిల్లలు ఫిట్​నెస్​ సాధించిన కొద్దీ పరీక్షల్లో మార్కులు పెరుగుతున్నాయని నిపుణలు తెలిపారు.

childeren
పిల్లలు
author img

By

Published : Aug 11, 2021, 8:14 PM IST

పిల్లలు చదువుల్లో బాగా రాణించాలని, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. అలాగని అస్తమానం పుస్తకాలు ముందేసుకొని చదువుకోమని మాత్రం పురమాయించకండి. రోజూ క్రమం తప్పకుండా పరుగెత్తుతూ ఉండమని చెప్పండి. శరీర సామర్థ్యం (ఫిట్‌నెస్‌) ఇనుమడించిన కొద్దీ పరీక్షల్లో మార్కులూ పెరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవా అధ్యయనం పేర్కొంటోంది.

దగ్గరి సంబంధం..

గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యానికీ మేధాశక్తికీ దగ్గరి సంబంధం ఉంది మరి. ఇదే చదువుల్లో రాణించటానికి, మంచి మార్కులు తెచ్చుకోవటానికి తోడ్పడుతోంది. పరిశోధకులు 8 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలను ఎంచుకొని.. శరీర సామర్థ్యం, తెలివి తేటలకు మధ్య గల సంబంధాన్ని అంచనా వేశారు. విషయగ్రహణ నైపుణ్య పరీక్షలను ఎదుర్కోవటానికి ముందు వీరికి పరుగెత్తే వ్యాయామాలను చేయాలని సూచించారు. శరీర సామర్థ్యం ఎక్కువగా గల పిల్లలు లెక్కల్లో, భాషా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవటం గమనార్హం.

శారీరక సామర్థ్యం మన కార్య నిర్వహణ మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇది పరోక్షంగా పరీక్షల్లో రాణించటానికి దోహదం చేస్తోందని పరిశోధకులు వివరిస్తున్నారు. పాఠశాలల్లో చదువులతో పాటు ఆటల వంటి వ్యాయామాలూ ముఖ్యమేననే విషయాన్ని అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

Health and Fitness: పిల్లలకెంత వ్యాయామం అవసరం?

వ్యాయామం మానకుండా ఉండాలంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.