ETV Bharat / sukhibhava

జుట్టు ఊడిపోతుందా?- పరిష్కారానికి ఇది చదివేయండి! - Causes of hair loss

ఈ రోజుల్లో మధ్యవయసు వారిలోనే కాక యువతలోనూ కనిపించే పెద్ద సమస్య జుట్టు రాలడం లేదా పలచపడటం. ఈటీవీ భారత్ సుఖీభవ బృందం ఈ విషయంపై 'డా.బత్రాస్ గ్రూప్​' ఉపాధ్యక్షులు, నిర్వహణా సంచాలకులు డా.అక్షయ్ బత్రాతో సంభాషించింది. పర్యావరణ కాలుష్యానికి అదనంగా, ఆహారంలో ఇనుము లోపం, థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు దీనికి కారణాలుగా పేర్కొన్నారు డా.బత్రా.

Treatment for hairloss
జుట్టు ఊడిపోతుందా! చదివేయండిక..
author img

By

Published : Mar 16, 2021, 7:11 AM IST

జుట్టు రాలడం చిన్న సమస్య అయినా వ్యక్తిగత జీవితాల్లోనే కాక, వృత్తి పరంగానూ చాలా నష్టం కలిగించవచ్చు. ఇది వారిని మానసికంగా కుంగతీసి, ఆత్మన్యూనతా భావానికి, మనో వ్యాకులతకు దారితీయవచ్చు. కొవిడ్ ఇన్ఫెక్షన్ తరువాత కూడా చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంది. 'డా. బత్రా' నిర్వహించిన ఒక సర్వే ప్రకారం..

  • 75 శాతం మంది స్త్రీలు బట్టతల గల పురుషులను ఇష్టపడటానికి అంగీకరించరు.
  • 80 శాతం మంది పురుషులు పొడవైన జుట్టు ఉన్న స్త్రీలనే ఇష్టపడతారు.
  • 81 శాతం మంది కేశ సౌందర్యం కోసం సాంప్రదాయక వైద్య విధానాలనే ఆశ్రయిస్తారు.
  • 88 శాతం మంది తలపై జుట్టు అందాన్ని ఇనుమడింపజేస్తుందని భావిస్తారు.

జుట్టు రాలడానికి కారణాలు:

  1. కొందరు తక్కువ సమయంలో బరువు తగ్గటానికి ఆహారంలో కోత విధించి పోషకాలను కోల్పోవడం.
  2. మానసిక ఒత్తిడి.
  3. ఔషధాలు, శస్త్ర చికిత్సలు, టైఫాయిడ్, మలేరియా లాంటి జబ్బులు.
  4. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల. ఉదాహరణకు కాన్పు తరువాత, ముట్లుడిగిన తరువాత, జుట్టు రాలుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వెంట్రుకలు పెరుగుతాయి, ప్రొజెస్టిరాన్ హార్మోన్ వల్ల జుట్టు రాలుతుంది. అందువల్ల జుట్టు మరలా పెరగటానికి 3 నెలలు వేచి చూడాలి. పీసీఓడీ లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది.
  5. నివాస స్థల మార్పు వల్ల నీటిలో లవణాల సాంద్రత ఎక్కువైనా కేశ పతనం జరుగుతుంది.

సాధారణంగా వెంట్రుకలు కొంత కాలం పెరుగుతాయి, కొంత కాలం అలాగే ఉంటాయి, కొంత కాలం రాలుతాయి తరువాత తిరిగి పెరుగుతాయి. ఈ దశలలో మార్పులు కలిగినపుడు జుట్టు రాలే దశ ఎక్కువ కాలం కనిపిస్తుంది. ఈ జుట్టు రాలే దశ 3 వారాల నుంచి 3 నెలల వరకు కొనసాగవచ్చు. దీన్ని మనం గుర్తించటానికి 6 వారాల నుంచి 3 నెలలు పట్టవచ్చు. శరీరంలో చాలా వేగంగా పెరిగే కణాలలో కేశాలు ఒకటి. అందువల్ల వీటికి ఎక్కువ పోషణ అవసరం:

  1. కేశమూలాలు(హెయిర్ రూట్స్) దెబ్బతినకుండా ఉంటే నూటికి నూరు శాతం జుట్టు తిరిగి వస్తుంది. జుట్టు రాలటం తాత్కాలికమే అవుతుంది.
  2. 70 శాతం మంది యువతలో, 30 మంది స్త్రీలలో జుట్టు పీక్కునే(ట్రికోటిల్లోమానియా) జబ్బు ఉంటుంది. వీరు మానసిక వైద్యుల వద్ద చికిత్స తీసుకోవాలి.
  3. కేశ మూలాలు కుంచించుకుపోవటం(యాండ్రోజనిక్ ఎలోపేషియా) వల్ల కలిగే కేశ పతనానికి చికిత్స అందించడం చాలా కష్టం.

వేరువేరు రకాల కేశ పతనాలకు వేరువేరు చికిత్సలు చేయాలి. ఆహారంలో ఇనుము లోటు, థైరాయిడ్, పీసీఓడీ మొదలైన సమస్యలలో ఔషధాల ద్వారా సులభంగా చికిత్స అందించవచ్చు. హోమియోపతి ఔషధాలు, పోషకాలను సమకూర్చే ఔషధప్రాయ ఆహారం, హెచ్​వీటీ చికిత్సలు ఉపయోగపడతాయి. కేశ పునస్థాపన(హెయిర్ ట్రాన్స్ ప్లాంట్), కృత్రిమ జుట్టు (విగ్), హెయిర్ స్ప్రే మొదలైనవి ఇతర పరిష్కారాలు. జుట్టు రాలడం ఆపటానికి ఏ చికిత్స తీసుకోవాలో వయసు, కారణం, దశ మొదలైన అంశాలపై ఆధారపడి నిర్ణయించాలి.

సొంత చికిత్స శ్రేయస్కరం కాదు:

జుట్టు రాలడానికి కారణం తెలిస్తే సొంత వైద్యం పనికిరాదని అర్థమవుతుంది. అసలు కారణం తెలియకుండా వాడే సౌందర్య సాధనాలు తాత్కాలికమైన ఫలితాన్ని మాత్రమే ఇస్తాయి. అందువల్ల వైద్యుల సలహననుసరించి ప్రత్యేక చికిత్స తీసుకోవాలి.

ఇదీ చదవండి: ఇలా మసాజ్ చేస్తే జుట్టు సమస్యలకు చెక్ పెట్టేయచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.