- రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్‌తో పనిలేదంటారు. దీనిలో ఉండే మాలిక్ యాసిడ్ పళ్లని శుభ్రం చేస్తుంది. నోటిని తాజాగా ఉంచుతుంది.
- స్ట్రాబెర్రీ, పైనాపిల్స్ పండ్లలో ఉండే బ్రోమిలిన్ దంతాలను శుభ్రం చేస్తుంది. చీజ్, పనీరుల్లో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్‌లు నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. నోట్లో తగినంత లాలాజలం ఉన్నప్పుడు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు.
- బాదంలోని ప్రత్యేకమైన ప్రొటీన్లూ, ఫ్యాట్లూ చిగుళ్లూ, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే తాజా పెరుగు తిన్నా మంచిదే.
ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష