ETV Bharat / sukhibhava

నల్ల మచ్చలతో సమస్యా?.. ఈ చిట్కాలు పాటిస్తే సరి! - చర్మం మీద నల్ల మచ్చలు

ఎంత అందంగా తయారైనా.. ముఖం మీద నల్లని మచ్చలు కనిపిస్తే.. శ్రమంతా వృథా అయినట్టే! వీటికి పరిష్కారాలు మీ వంటింట్లోనే ఉన్నాయి.

blackheads on face
నల్ల మచ్చలతో సమస్యా?.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!
author img

By

Published : Aug 18, 2021, 8:01 AM IST

ముఖం మీద నల్ల మచ్చలు పోవాలంటే ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తేనె, గంధం పొడి, ఓట్​మీల్​ వంటివి నల్ల మచ్చలు పోగొట్టేందుకు ఉపయోగపడతాయి.

నిమ్మరసం-తేనె..

నల్ల మచ్చలకు ముఖ్య కారణం విటమిన్‌ సి లోపమే. రెండు చెంచాల నిమ్మరసంలో కాస్త తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాలయ్యాక చల్లని నీటితో కడగాలి.

గంధం పొడి - గులాబీ నీరు..

గంధం పొడికి రోజ్‌వాటర్‌ను, రెండు చుక్కల గ్లిజరిన్‌ను కలిపి పేస్టు చేయాలి. ఉదయాన్నే లేచాక మచ్చలకు రాయలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగి.. మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా ఓ పదిహేను రోజులు క్రమం తప్పకుండా రాసుకుంటే ఫలితం ఉంటుంది.

పాలు-గులాబీ ముద్ద..

పాలల్లో చెంచా గులాబీ రేకల మిశ్రమం కలపాలి. పావు గంటయ్యాక దాన్ని ముఖానికి రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే... మచ్చలు తగ్గు ముఖం పడతాయి.

ఓట్‌మీల్‌- పెరుగు.. చెంచా పెరుగుకు రెండు చెంచాల ఓట్‌మీల్‌ కలిపి రాసుకోవాలి. అరగంటయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మచ్చలు తగ్గి నిగారింపు వస్తుంది.

ఇదీ చదవండి : చురుకైన వీర్యకణాల కోసం కొత్త మందు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.