ETV Bharat / sukhibhava

రోజురోజుకూ మీ బరువు పెరిగిపోతోందా..? - బరువు తగ్గేందుకు చిట్కాలు

రోజూ నిద్రపోయే ముందు చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీకు తెలియకుండానే బరువు పెరిగే ప్రమాదం ఉంది. మరి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దామా..

రోజురోజుకూ మీ బరువు పెరిగిపోతోందా..?
రోజురోజుకూ మీ బరువు పెరిగిపోతోందా..?
author img

By

Published : Jun 25, 2021, 9:24 AM IST

రాత్రి భోజనం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం.. ఆ వెంటనే నిద్రపోవడం వల్ల బరువు ఎక్కువవుతుంది.. పొట్ట విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి నిద్రకి కనీసం మూడు గంటల ముందే భోజనాన్ని ముగించాలి. రాత్రి భోజనంలో పిండిపదార్థాలు తక్కువగా, మాంసకృత్తులు మెండుగా ఉండేలా చూసుకోవాలి.

  • ఒత్తిడి, ఆందోళనలు... ఇవి కూడా బరువును పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. నిద్రపోయే ముందు ఎక్కువగా ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. దాంతో అది అలసిపోయి నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడతారు. ఇలాంటి చాలా సందర్భాల్లో బరువు పెరుగుతుంటారు. నిద్రలేమి కూడా బరువు పెరగడానికి ఓ కారణమని నిపుణుల అభిప్రాయం.
  • ఆలస్యంగా నిద్రపోవడం... పెరిగిన పని వేళలు, అదేపనిగా మొబైల్‌, ల్యాప్‌టాప్‌ చూడటం వల్ల కూడా నిద్రాభంగం అవుతుంది. కళ్లకు విశ్రాంతి ఉండదు. దాంతో నిద్రపట్టదు. ఇది క్రమేపీ బరువు పెరుగుదలకు కూడా కారణమవుతుంది.
  • తిన్న తర్వాత శారీరక శ్రమ చేయకుండా ఒకేచోట కూర్చొన్నా బరువు, పొట్ట పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. కాబట్టి తిన్న తర్వాత నాలుగడుగులైనా వేయాల్సిందే.

ఇదీ చూడండి: నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.