కొంతమంది చూడటానికి చాలా అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరికొందరు డల్‌గా.. ఎప్పుడూ కోల్పోయినట్లు ముఖం వాడిపోయి ఉంటారు. అందంగా లేమని భావిస్తారు. అయితే అందంగా ఉండటమంటే.. తెల్లగా ఉండటం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి.
ముఖం కాంతివంతంగా కనిపిస్తే.. ఏ రంగులో ఉన్నా.. అందంగానే కనిపిస్తారు. ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే.. మార్కెట్లో దొరికే క్రీములన్నీ రాయనక్కల్లేదు. వంటింట్లో దొరికే పదార్థాలతోనే ముఖాన్ని కాంతివంతంగా దగదగ మెరిసేలా చేసుకోవచ్చు.
- ముఖ వర్ఛస్సుకు సాయపడే వాటిల్లో ప్రధానమైంది ఆహారం. చర్మానికి కావాల్సిన తేమ అందాలి. ఇందులో తగిన విధంగా ఆహారంలో సరిపడినంత ద్రవ పదార్థాలు ఉండాలి. అయితే ఒకేసారి కాకుండా.. కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఈ ద్రవ పదార్థాలు చర్మానికి తగిన తేమను అందిస్తాయి.
- కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటికి శరీరంలో ఉండే మలినాలను తొలగించే సామర్థ్యం ఉంటుంది. పళ్లు.. ముఖం ఆరోగ్యం ఉండటానికి సాయపడతాయి. అందుబాటులో ఉన్న పళ్లను రోజుకొకటి తీసుకుంటే మంచిది.
- కారం, మసాల అధికంగా ఉన్న పదార్థాలు.. అలాగే తేలికగా జీర్ణం కాని పదార్థాలను దూరంగా ఉంటే మేలు.
- వ్యాయామాలు.. ముఖం ప్రకాశవంతంగా ఉండేందుకు తోడ్పడతాయి. ప్రధానం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ముఖంలో ఉండే కండరాలపై సానుకూల ప్రభావం పడుతుది. దీంతో ముఖం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. మత్స్య, భుజంగాసనం, యోగముద్ర, త్రికోణ ఆసనాలు వేయడం మంచిది.
- రోజూ నిర్ణీత సమయంలో ప్రశాంతంగా నిద్రపోవాలి.
- మనసును నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి.
- సానుకూల దృక్పథంతో ఎప్పుడూ నవ్వుతూ.. ఉండాలి.
చిట్కాలు..
- ఎండిన కమలాపండు తొక్కలను ఎండబెట్టి చూర్ణంలా తయారు చేసుకోవాలి. అలాగే నిమ్మతొక్కలను ఇదే మాదిరిగా చేయాలి. తర్వాత పసుపు, చందనం, కమలాపండు తొక్కల చూర్ణం, నిమ్మతొక్కల చూర్ణాలను 25 గ్రాములు చొప్పున తీసుకోవాలి. వాటిని బాగా జల్లించుకోవాలి. తర్వాత అందులో తగిన మోతాదులు శెనగపిండిలో కులుపుకోవాలి. దీనిని కొద్ది కొద్దిగా తీసుకుని కొన్నినీళ్లు వేసి రుద్దుకుని ముఖం కడుక్కోవాలి.
ఫేస్‌ప్యాక్
- లోధ్ర, సుగంధపాల, చందనం వీటిని చూర్ణం చేసి.. 25 గ్రాముల చొప్పున కలుపి ఉంచుకోవాలి. తర్వాత తాజాగా లభించిన గులాబీ రేకులకు కాస్త నీళ్లు చేర్చి పేస్టులా తయారు చేయాలి. దీనిని ముందు తయారు చేసుకున్న చూర్ణంలో కలుపుకోవాలి. దానిని ముఖంపై చూర్ణం రాసుకోవాలి. 10 -15 నిమిషాలి ఉంచి కడుక్కోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: కాలిన గాయాల మచ్చలు పోవాలంటే.. ఇలా చేయండి!