Tips For Dating to Marriage and Things to keep in Mind: జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది అనుకున్నంత సులువు కాదు. పెళ్లి తర్వాత భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఊహించుకొని.. ఇప్పుడు పార్ట్నర్ను సెలక్ట్ చేసుకోవడం కత్తిమీద సామే. ఒకరికొకరు తోడుగా జీవితాంతం ఉండగలమా..? ఆనందంగా ఉండగలమా..? అనే సందేహాలు ఎన్నో వస్తుంటాయి. మనస్పర్ధలు, అహంకారం, అనుమానాలు వంటి వాటితో నిత్యం ఎన్నో జంటలు విడిపోతూనే ఉన్నాయి. అందుకే.. పెళ్లైన తర్వాత అసలు విషయం తెలుసుకుని కుమిలిపోయేకన్నా.. ముందుగానే వారి గురించి తెలుసుకుంటే సరిపోతుంది కదా? అప్పుడు వారిని పెళ్లి చేసుకోవాలా.. వద్దా? అనే నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది కదా? అనే ఆలోచనల్లోంచి వచ్చిన పద్ధతే డేటింగ్.
మన దేశంలో కూడా ఈ కాన్సెప్ట్ విస్తరిస్తోంది. ఈ విధానం ద్వారా.. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చంటూ.. యువతరం ఈ వైపు అడుగులు వేస్తోంది. లైఫ్ పార్ట్నర్గా సెలక్ట్ చేసుకునే వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని.. నచ్చితే ముందుకు వెళ్లడం.. లేదంటే అక్కడితో ఆపేయడం ఈ డేటింగ్లో మెయిన్ థింగ్. అయితే.. డేటింగ్లో ఎలాంటి విషయాలను ఎదుటి వారి నుంచి తెలుసుకోవాలి? ఎలాంటి సందేహాలను క్లారిఫై చేసుకోవాలి? ఎలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయంలో నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. అవేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మీ భాగస్వామితో బంధం నూరేళ్లు నిలవాలంటే.. ఇలా చేయండి
ఇవి గమనించండి : డేటింగ్లో భాగంగా.. ఒకరి ఇంట్లో మరొకరు.. రెండు, మూడు రోజులు ఉండేందుకు ప్రయత్నించండి. ఇంట్లోని వారితో.. మీ కాబోయే భాగస్వామితో సమయాన్ని గడపండి. ఈ క్రమంలో వారి అలవాట్లు, వ్యక్తిత్వాలు, దినచర్యలను అర్థం చేసుకోండి. వారి పద్ధతిలో మీరు కలిసిపోగలరా? లేదా? అనే విషయంపై ఓ అవగాహన వస్తుంది.
మీ భయాలను చర్చించండి: డేటింగ్ తర్వాత చాలా మంది.. తమ పార్ట్నర్ వ్యక్తిత్వంలో కొన్ని నెగెటివ్ పాయింట్లను నోటీస్ చేస్తారు. వాటిని చూస్తూ.. కలిసి ముందుకు వెళ్లగలమా? అని భయపడుతుంటారు. మెజారిటీ జనం ఆ భయాన్ని అధిగమించడం వదిలేసి.. బంధాన్నే వద్దు అనుకుంటారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే.. మీ భాగస్వామితో ఆ విషయాలు గురించి చర్చించండి. మీ భయాలను వారి ముందు పెట్టండి. మీ పార్టనర్‌కు అర్థమయ్యేలా చెప్పండి. ఇది చాలా ముఖ్యం. భయాలే ఎక్కువ నష్టం కలిగిస్తాయి. మనస్పర్థలకు దారితీస్తాయి.
నా భర్త ఫోన్‌లో ఎక్కువసేపు ఆమెతో ఫోన్ మాట్లాడుతున్నాడు.. నేనేం చేయాలి..?
అపార్థాలను అధిగమించాలి: గొడవలు, అపార్థాలు రావటం సహజం. ఇలాంటి మిస్ అండర్ స్టాండింగ్స్‌ను అధిగమించడం అనేది.. మీ పార్ట్‌నర్‌పై మీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని బట్టే.. అవి దూది పింజలా ఎగిరిపోతాయా? గుదిబండలా మిగిలిపోతాయా? అన్నది ఆధారపడి ఉంటుంది.
ప్రోత్సాహం: వృత్తి, ప్రవృత్తి ఏదైనా.. మీరిద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఒకరికొకరు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చుకుంటున్నారో.. దాన్నిబట్టే మీ ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యకరమైన అనుబంధం అంటే ఇదే.
చివరగా గుర్తు పెట్టుకోండి : మనిషి అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉండాలంటే సాధ్యం కాదు. మీ పార్ట్నర్ మాత్రమే కాదు.. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికీ ఒకటికి మించిన బలహీనతలు ఉంటాయి. మీలో కూడా ఉంటాయి. వాటిని దాచడానికి ప్రయత్నించకండి. మీ బలహీనతను మీపార్ట్నర్ ముందు అంగీకరించండి. దాన్నే నిజాయితీ అంటారు. ఇలా.. ఒకరికొకరు మీ అభిప్రాయాలను, భయాలను, లక్ష్యాలను, ఆశలను, ఆశయాలను పూర్తి స్థాయిలో మనసు విప్పి మాట్లాడుకోండి. అన్ కండిషనల్‌గా ప్రేమించేందుకు సిద్ధమవ్వండి. ఇవన్నీ చేసిన తర్వాతే.. మీ డేటింగ్ పార్ట్‌నర్‌పై మీరు సరైన అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలా..? ముగించాలా..? అని!
బ్రేకప్ బాధల నుంచి సుఖంగా మార్చే సూపర్ చిట్కాలు
"నన్ను పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు మరొకరిని ప్రేమిస్తున్నాడు.. ఏం చేయాలి?"