‘నిద్రలేమి శరీరంలో సహజ రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. శరీరంలో వైరస్ బారిన పడిన కణాల్ని చంపేవి ఇవే. కాబట్టి నిద్ర తక్కువయ్యే కొద్దీ ఒంట్లో వైరస్ రిస్కు పెరుగుతున్నట్టే’ అంటున్నారు వైద్యులు. ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్నా నిద్రలేమితో బాధపడే వారిలో ఆ మందు ప్రభావం సగానికి తగ్గిపోతుందట. అంటే మంచి నిద్ర సగం వ్యాక్సిన్‌తో సమానమన్న మాట.
త్వరలోనే కొవిడ్‌కి వ్యాక్సిన్ వస్తుంది. అప్పటివరకూ టెన్షన్ పడకుండా రోజూ హాయిగా ఏడెనిమిది గంటలు నిద్రపోండి! ‘ఎంత ప్రయత్నించినా నిద్ర పడితేగా’ అంటారా అయితే ఇలా చేసి చూడండి.
ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండండి.. రోజంతా చలాకీగా ఉంటారు. రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది.
చాలామందికి సాయంత్రం కాఫీ తాగడం అలవాటు. కానీ కొందరిలో కెఫీన్ సెన్సిటివిటీ వల్ల ఆ కాఫీ వారిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. కాబట్టి సాయంత్రం కాఫీని మానేయండి.
రాత్రి భోజనంలో తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలని మాత్రమే తీసుకోండి.
రాత్రిపూట స్క్రీన్ టైమ్‌ని తగ్గించండి. కృత్రిమ వెలుగు నిద్ర హార్మోన్ మెలటోనిన్ పనిని ఆటంక పరుస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచే ఏ పుస్తకమో చదువు కోవడం మంచిది.
- ఇదీ చదవండి:పిల్లలు బరువు పెరగాలంటే ఇలా చేయాలి