పగలు రాత్రీ; అమావాస్య పౌర్ణమీ; వానాకాలం ఎండాకాలం చలికాలం; వసంతం గ్రీష్మం శిశిరం హేమంత వర్ష శరద్ రుతువులు ఇలా ప్రకృతికి కూడా ఓ జీవనశైలి ఉంటుంది. ఈ జీవనశైలిలో సమతుల్యత ఉన్నంతకాలం అంతా భేషుగ్గా ఉంటుంది. అది తప్పితే ఉపద్రవాలు సంభవిస్తుంటాయి. మన జీవితం కూడా ప్రకృతికి దగ్గరగా, దానితో శ్రుతి కలసి ఉన్నంతకాలం మనిషికి ఆరోగ్యం ఆనందం రెండూ లభిస్తాయి. ఎప్పుడైతే మనిషి తాలూకు జీవనశైలి గజిబిజి గందరగోళంగా తయారవుతుందో అప్పుడు అనారోగ్యం, అసంతృప్తి దరిచేరుతాయి.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తినే తిండి, చేసే వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లు ఇవన్నీ గతి తప్పడం వల్ల ఆరోగ్యం చిత్తవుతోంది. అందుకే నేడు మధుమేహం, స్థూలకాయం, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతాలు, కీళ్లవాతాలు ఇలా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి జీవనశైలి జబ్బుల్ని పరుసవేదిలా మాయం చేసేందుకు నేడు రామోజీ ఫిలింసిటీలో సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందుబాటులో ఉంది.
''డయాబెటిస్ ఒక రుగ్మత, అది జబ్బు కాదు. థైరాయిడ్ కూడా అంతే. స్థూలకాయం కూడా అంతే. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి ఇవన్నీ కూడా రుగ్మతలే, జబ్బులు కాదు. ఈ రుగ్మతలన్నింటినీ అల్లోపతిలో నయం చేయలేం. జీవితాంతం మందులు వేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలి. కాలక్రమంలో మందుల మోతాదు పెంచుకుంటూ పోతారు. ఫలితం పెద్దగా ఉండదు. పూర్తిగా నయం కావు. ఇక్కడ సుఖీభవ వెల్ నెస్ సెంటర్లో నివారణ ఉంటుంది. జీవనశైలిని మారుస్తాం. ఉదయం ఎప్పుడు లేవాలి, రోజువారీ పనుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వృత్తిగత జీవితంతో వ్యక్తిగత జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి వంటివన్నీ కూడా ఇక్కడ మేం నేర్పిస్తాం.
ఇక్కడ ప్రధానంగా మధుమేహానికి ప్రకృతివైద్యం అందించే చక్కటి నివారణ మార్గాలున్నాయి. మధుమేహమే కాదు, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిళ్లు, స్థూలకాయం ఇలాంటి జీవనశైలి రుగ్మతలన్నింటినీ మేం ట్రీట్ చేస్తాం. మా దగ్గరికి ఒత్తిడిని ఎదుర్కొనేవాళ్లు వస్తుంటారు. మా దగ్గర పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ప్రధానంగా మనకు ప్రకృతి సిద్ధంగా లభించే నీరు, నేల, నిప్పు, నింగి, వాయువు ఇలా పంచభూతాలున్నాయి. వీటి ద్వారా రుగ్మతల్ని నయం చేయడానికి మేం ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద లభిస్తాయి. ఆయుర్వేద ఔషధ మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని రోజువారీ ఆహారంలో వాడతాం. ఈ జీవనశైలి సమస్యల్ని నివారించడంలో గానీ, వాటికి చికిత్స చేయడంలో గానీ మేం ఆహారాన్నే ఔషధంగా మలచి డైట్ ప్రణాళిక రచిస్తాం.''
- డాక్టర్ ఎం.అర్చన, సుఖీభవ వెల్నెస్ సెంటర్ డైరెక్టర్
ఒత్తిళ్ల నుంచి దూరం..
పాలపుంతలో గ్రహాలన్నీ క్రమబద్ధంగా తిరుగుతాయి. భూమి కూడా నిత్యం తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ఏడాదికి ఓసారి సూర్యుణ్ని చుట్టేస్తుంది. ప్రకృతిలో ఈ క్రమబద్ధత అనేది ఎప్పుడూ తప్పదు. కానీ ప్రకృతిలో అంతర్భాగమైన మన జీవితంలో అలాంటి క్రమబద్ధత ఉందా అంటే అది గతి తప్పిందనే చెప్పాలి. వేళకు భోంచేయము. జిహ్వ చాపల్యం చంపుకోలేక ఎలాంటి జంక్ ఫుడ్ నైనా తినేస్తాం. నిద్ర వేళలు సరిగా ఉండవు. బద్ధకంతో వ్యాయామం చేయము. జీవితంలో క్రమశిక్షణ తప్పితే అంతిమంగా అది అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను తెచ్చిపెడుతుంది. అందుకే నేడు జీవనశైలి సమస్యలనేవి అందరిలోనూ పెద్ద తలనొప్పిలా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవనశైలిని చక్కబెట్టుకుని ఆరోగ్యాన్ని ఒడిసిపట్టుకునే మార్గాన్ని చూపించేందుకు సుఖీభవ వెల్ నెస్ సెంటర్ సహకరిస్తుంది.
వేళకు సమతులాహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర పోవడం, ఒత్తిళ్లు శ్రుతి మించకుండా చూసుకోవడం లాంటివన్నీ చేయడం ద్వారా జీవనశైలి చక్కగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే జీవనశైలి సమస్యలుంటే మాత్రం ప్రకృతికి దగ్గరగా ఉండే సుఖీభవ వెల్నెస్ సెంటర్ లాంటి వాటిని సంప్రదించవచ్చు.
ఆహారమే ఔషధంగా, యోగ, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల దన్నుగా జీవన శైలి జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచడం సుఖీభవ వెల్నెస్ సెంటర్ ప్రత్యేకత. ఇక్కడి నిపుణులు అందించే చికిత్సలతో అధిక బరువు, స్థూలకాయం, హైబీపీ, షుగర్ వంటి జీవన సరళి రుగ్మతల్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.