ETV Bharat / sukhibhava

లక్షణాలు లేవని నిర్లక్ష్యం చేస్తే.. తప్పదు భారీ మూల్యం - Prevention of BP, diabete

తలనొప్పి వస్తే ఓ గోలీ వేసుకుంటాం... విరేచనాలు అవుతుంటే వెంటనే ఓ మాత్ర వేసేస్తాం. కానీ కొన్ని జబ్బుల్లో ఎటువంటి లక్షణాలు, బాధలు పైకి కనిపించవు. ఉదాహరణకు అధిక రక్తపోటు, మధుమేహుల్లో దీర్ఘకాలం ఆ సమస్యలున్నా... ఎప్పుడో గానీ అవి బయటపడవు. వాటిని గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడకపోతే పెనుముప్పు పొంచి ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. పలువురు వైద్యనిపుణుల సలహాలు, సూచనలతో ‘ఈటీవీ భారత్​’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

Health information
లక్షణాలు లేవని నిర్లక్ష్యం చేస్తే.. తప్పదు భారీ మూల్యం
author img

By

Published : Dec 19, 2020, 6:38 AM IST

జీవనశైలి వ్యాధులు జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. వాటిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించకపోవడం ఒక సమస్య అయితే... గుర్తించినా వైద్యుల సూచనల్ని నిర్లక్ష్యం చేయడంతో తర్వాత ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం.. తెలంగాణలో అధిక రక్తపోటుతో 28.75 శాతం, మధుమేహంతో 16.4 శాతం మంది చికిత్స పొందుతున్నారు. రెండింటితో బాధపడుతున్నవారు సుమారు 32-34 శాతం మంది ఉంటారని నిపుణుల అంచనా. ఇలాంటివి నొప్పి తెలియని జబ్బులు. వీటికి క్రమం తప్పకుండా మందులు వాడితే అదుపులో ఉంటాయి. లేదంటే గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, పక్షవాతం వంటి అనేక రకాల సమస్యలు రావడానికి కారణమవుతాయి. ఆస్తమా మందులను వాడితే దుష్ఫలితాలున్నాయనే భావనతో.. కొందరు కొంచెం ఉపశమనం లభించగానే ఔషధాలను మానేస్తుంటారు. దీనివల్ల సమస్య మళ్లీ విజృంభించవచ్చు. వీరిలో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా దెబ్బతినే ప్రమాదముంటుంది.

ప్రత్యక్ష ఉదంతాలు

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(30)కి మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. వైద్యుడు 7 రోజుల పాటు మందులు రాసిచ్చారు. రెండోరోజే గుణం కనపడడంతో నాలుగో రోజు నుంచి ఆ మందులను వాడడం మానేశాడు. 10 రోజుల్లో ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టింది. అత్యవసర మూత్రపిండాల వైఫల్యానికి(అక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌కు) దారి తీసింది. 15 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. సరిగ్గా మందులు వాడితే రూ.500తో నయమయ్యేది. రూ.5 లక్షల వరకూ ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

వరంగల్‌ నగర జిల్లా హన్మకొండకు చెందిన ఓ కిరాణా వ్యాపారి క్షయ బారినపడ్డారు. 9 నెలలు ఔషధాలు క్రమం తప్పకుండా వాడాలని వైద్యుడు సూచించారు. రెణ్నెల్లు వాడగానే లక్షణాలు క్రమేణా తగ్గిపోయాయి. దీంతో మందులు వేసుకోవడాన్ని మానేశారు. ఆర్నెల్ల తర్వాత ఉన్నట్టుండి వ్యాధి తీవ్రంగా దాడి చేసింది. మొదట్లో సూచించిన మందులు ఇప్పుడు పనిచేయని దుస్థితి ఎదురైంది. ఇతర ఔషధాలను ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి వచ్చింది. నెల రోజుల పాటు చికిత్స అనంతరం కొద్దిగా కోలుకొని తిరిగి ఇంటికి చేరారు.

స్వల్ప జాగ్రత్తలతో...

ఎటువంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా.. మందుల వాడకంలో స్వల్ప జాగ్రత్తలు పాటించడం ద్వారా దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకడానికి మార్గం సులభమవుతుందని సూచిస్తున్నారు. జబ్జును గుర్తించినప్పుడు ఏ మందును, ఎంత కాలం వాడాలన్నది శాస్త్రీయ విధానంలో డాక్టర్లే వివరిస్తారు. నిర్దేశిత డోసును, సూచించినన్ని రోజులు వాడితేనే ఆ ఔషధ గుణం కనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా ఇన్‌ఫెక్షన్లకు 7-10 రోజులు.. క్షయ వంటి జబ్బుల్లో అయితే 9-12 నెలలు.. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకైతే జీవిత కాలం ఔషధాలను వినియోగించాల్సి ఉంటుంది.

మరికొన్ని ముఖ్యమైన ముప్పులు

  • కొలెస్ట్రాల్‌ మందులను క్రమం తప్పకుండా వాడకపోతే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరైడ్స్‌ వంటివి పెరిగి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు తీవ్రతను పెంచుతాయి.
  • రక్తహీనతకు సూచించిన మందులను మానేస్తే.. ఆయాసం, నీరసం వంటి వాటితో పాటు గర్భిణుల్లో ప్రసవ సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి.
  • మూర్ఛ మందులను మధ్యలో మానేస్తే.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఉన్నట్టుండి ఫిట్స్‌ వచ్చే ప్రమాదముంది. ఉదాహరణకు వాహనం నడుపుతుండగా ఫిట్స్‌ వస్తే చాలా ప్రమాదం.
  • హెచ్‌ఐవీ కూడా నిశ్శబ్దంగా కబళిస్తుంది. మందులు వాడడం మానేసినా.. చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ.. మరింత తీవ్రంగా విరుచుకుపడుతుంది.
  • కంట్లో గ్లకోమా కూడా అత్యంత ప్రమాదకరమైన జబ్బు. కంటి రక్తనాళాల్లో రక్తపీడనం పెరిగిపోతుంది. ఇది సోకినట్లుగా కూడా గుర్తించలేరు. జబ్బు ముదురుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది. ఒకసారి చూపు తగ్గిపోతే.. తిరిగి పూర్వస్థితికి తీసుకురావడం కష్టసాధ్యం. దీనికి చుక్కల మందును క్రమం తప్పకుండా జీవితాంతం వేసుకోవాల్సిందే.
  • కిడ్నీ జబ్బుల్లోనూ తొలిదశలో మూత్రంలో అల్బుమిన్‌ పోతుంటుంది. ఆ దశలో మందులు వాడడం ద్వారా వ్యాధి ముదరకుండా నియంత్రించవచ్చు. కానీ పైకి లక్షణాలేమీ కనిపించవు కాబట్టి ఎక్కువమంది వైద్యులు సూచించిన మందులను మధ్యలోనే మానేస్తుంటారు. ఫలితంగా కొన్నేళ్ల తర్వాత మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

ఔషధాలు ఆరోగ్యానికి పెట్టుబడి

బీపీ, షుగర్‌లు అదుపులో ఉన్నాయనే కారణంతో కొందరు మందుల్ని మధ్యలోనే ఆపేస్తుంటారు. నిజానికి మందులు వాడడం వల్లనే అవి అదుపులో ఉన్నాయనేది గుర్తించాలి. ఒక్కసారి అనారోగ్యం తీవ్రమై ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చుతో పోల్చితే.. వైద్యులు చెప్పినట్టు మందులు వాడడం వల్ల అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే మందుల ఖర్చును ఆరోగ్యానికి పెట్టుబడిగా భావించాలి. వైద్యులు కూడా అనవసరమైన మందులు తగ్గించాలి. అక్కర్లేకపోయినా ఔషధ జాబితాను పెంచామంటే.. అందులో ఏది ముఖ్యమో గుర్తించలేక.. వాడాల్సినవి వాడకుండా వదిలేసే ప్రమాదముంది. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహార అలవాట్లు, కనీసం ఆరు గంటల నిద్ర ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. -డాక్టర్‌ గంగాధర్‌, మూత్రపిండాల వైద్యనిపుణులు, నిమ్స్‌

మందులు వాడితే పూర్తిగా నయం

క్షయకు కనీసం 6-9 నెలల వరకూ మందులను వాడాలి. వీటితో తొలి నెల-నెలన్నరలోనే ఉపశమనం కలుగుతుంది. దాదాపు 70-80 శాతం బ్యాక్టీరియా నాశనమవుతుంది. ఇంకా మిగిలిన 20-30 శాతం కూడా పూర్తిస్థాయిలో నాశనమయ్యేందుకు సమయం పడుతుంది. ఒకవేళ కొద్దికాలం వాడి మధ్యలో ఆపేస్తే.. ఆ మిగిలిపోయిన బ్యాక్టీరియా మళ్లీ జడలు విప్పుతుంది. కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా కిడ్నీ, మెదడు, వెన్నెముక, కాలేయం, జీర్ణకోశం తదితర ఇతర అవయవాలకు కూడా పాకుతుంది. అంతకుముందు వాడిన ఔషధాలు కూడా ఈసారి పనిచేయవు. అదే వైద్యుని సూచనల మేరకు వాడితే.. పూర్తిగా నయమవుతుంది. -డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, శ్వాసకోశ వైద్య నిపుణులు,
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ

మానసిక వైద్యంలో దుష్ఫలితాలు అపోహే
మానసిక రుగ్మతలకు నిర్దేశిత కాల పరిమితి వరకూ చికిత్స అందిస్తే చాలా వరకూ నయమవుతాయి. ఉదాహరణకు కుంగుబాటు(డిప్రెషన్‌) సమస్యకు మందులు మొదలుపెట్టిన రెండు నెలల్లోనే నిద్రపట్టకపోవడం, దిగులుగా ఉండడం, ఆందోళన, ఒత్తిడి వంటి ప్రధాన లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అయితే పూర్తిగా నయమవడానికి దాదాపు 9 నెలలు పడుతుంది. అయితే బాధితుల్లో 60-70 శాతం మంది పూర్తిస్థాయిలో మందులు వాడకుండా మధ్యలోనే ఆపేస్తారు. పైగా ఈ మందులు వాడడం వల్ల దుష్ఫలితాలు వస్తాయని మానేస్తుంటారు. ఇది అపోహే. మధ్యలో మానేస్తే.. జబ్బు కూడా తీవ్రమవుతుంది. మందుల మోతాదు పెంచాల్సి వస్తుంది. ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. -డాక్టర్‌ ప్రసాదరావు, మానసిక వైద్యనిపుణులు, ఆశా ఆసుపత్రి

ఇదీ చూడండి:నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ముప్పే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.