ETV Bharat / sukhibhava

ఎక్కువ కాలం బతకాలంటే ఇవి తినండి!

శాకాహారంలో లభించే మాంసకృత్తులు ఎక్కువగా తీసుకున్నవారిలో ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. వృక్ష సంబంధ ప్రొటీన్లతో నిండిన పప్పుగింజలు ఎక్కువగా తినేవారి జీవితకాలం పెరుగుతున్నట్టు వెల్లడైంది.

Those who consume more of the protein available in vegetarianism have a lower risk of dying
ఎక్కువ కాలం బతకాలంటే ఇవి తినండి!
author img

By

Published : Oct 16, 2020, 10:35 AM IST

ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? మాంసాహారం కాస్త తగ్గించండి. బదులుగా పప్పుగింజలు (బాదం, అక్రోట్లు, పిస్తా వంటివి), సోయా, పప్పులు, చిక్కుళ్లు తీసుకోండి. వృక్ష సంబంధ ప్రొటీన్లతో నిండిన ఇలాంటివి ఎక్కువగా తినేవారి జీవనకాలం పెరుగుతున్నట్టు తేలింది మరి. వృక్ష ప్రొటీన్ల వాడకం, మరణం ముప్పునకూ మధ్య గల సంబంధంపై జపాన్‌ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు 20 ఏళ్ల పాటు 70వేలకు పైగా మందిని పరిశీలించి ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు.

శాకాహారంతో లభించే మాంసకృత్తులు ఎక్కువగా తీసుకున్నవారికి ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 13శాతం తక్కువగా ఉంటుండటం గమనార్హం. తక్కువ వృక్ష ప్రొటీన్లు తిన్నవారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకున్నవారికి గుండెజబ్బుతో మరణించే ముప్పు 16శాతం తక్కువగానూ ఉంటోంది. మాంసం వాడకాన్ని 3శాతం తగ్గించినా చాలు. అన్నిరకాల కారణాలతో సంభవించే మరణం ముప్పు 34శాతం తగ్గుముఖం పడుతుండగా.. క్యాన్సర్‌ మరణాల ముప్పు 39శాతం, గుండెజబ్బు మరణాల ముప్పు 42శాతం తగ్గుతుండటం విశేషం.

ఇదీ చూడండి: 'జుట్టంత' బెంగ!.. అపోహలకు చెక్​ పెట్టండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.