These Things To Do Sleeping After Sex : భార్యభర్తల మధ్య బంధం కలకాలం ఉండాలంటే వారి శృంగారం జీవితం ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరి లైంగిక ఆరోగ్యం బాగుండాలంటే శృంగారంలో పాల్గొన్న తరవాత కొన్ని పనులను కచ్చితంగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు తలేత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మూడ్‌ను సెట్ చేయడం నుంచి పర్ఫెక్ట్ ఫోర్ ప్లే వరకు సెక్స్‌కు ముందు ఏం చేయాలో అందరికీ తెలిసిందే. కానీ శృంగారం తరవాత ఏం చేయాలన్నది చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. దీంతో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే శృంగారం తరవాత ఎటువంటి పనులు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Things To Do Sleeping After Sex : శృంగారం తరవాత మీ భాగస్వామిని హత్తుకోవడం, కలిసి నిద్రపోవడం లాంటివి చాలా మంది చేస్తుంటారు. ఇది ఒక మంచి అలవాటే. కానీ, వీటన్నింటి కంటే శృంగారం తరవాత ఖచ్చితంగా కొన్ని పనులు చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. శృంగారం తరవాత భార్యభర్తలిద్దరూ పరిశుభ్రంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
వాష్ రూం వెళ్లడం :
శృంగారం తరవాత భార్యభర్తలిద్దరూ తప్పకుండా వాష్ రూం వెళ్లాలి. లేకపోతే చెడు ద్రవాలు బయటకు విడుదల కాకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భార్య భర్తలు శృంగారం తరవాత వాష్ రూం వెళ్లడం ద్వారా చెడు వీర్యకణాలు బయటకు వెళ్లి, అవాంఛిత గర్భధారణ సమస్యను తగ్గిస్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు చెడు బ్యాక్టీరియా మూత్రనాళానికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి, శృంగారనికి ముందు, తరవాత కచ్చితంగా వాష్ రూంకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ముత్రం రాకపోతే చల్లని నీళ్లు తాగి మూత్ర విసర్జన చేయడం మంచిదని అంటున్నారు.
ప్రైవేటు భాగాలు శుభ్రం చేసుకోవాలి :
భార్యభర్తల శృంగారం తరవాత ప్రైవేటు భాగాలను గోరు వెచ్చని నీటితో, తక్కువ గాఢత గల సబ్బులు, లేదా పీహెచ్ వాల్యూ తక్కువగా ఉన్న బాడీ వాష్ లిక్వీడ్స్‌తో క్లీన్ చేసుకోవాలి. తరవాత మెత్తటి, పొడి టవల్‌తో తేమ లేకుండా శుభ్రం చేసుకోవాలి. కానీ, ఎప్పుడు ప్రైవేటు భాగాలను ముందు నుంచి వెనుకకే శుభ్రం చేయాలి. యోని సొంతగా శుభ్రపరుచుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, మనం బయటి భాగాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఓవర్ దీ కౌంట్ ఉత్పత్తిలో డౌచింగ్ చేయటం వల్ల యోని సంక్రమణ మరింత పెరుగుతుంది. దీంతో సున్నితమైన బ్యాక్టీరియా మరణించి యూరిన్ ఇన్ఫెక్షన్, యోనిటిస్, చికాకు పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు శృంగారం తరవాత ప్రైవేటు భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!
ఉతికిన బట్టలు వేసుకోవాలి :
శృంగారం తర్వాత ఉతికిన బట్టలు, ఇనర్స్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బెడ్ షిట్స్‌ను కూడా మార్చాలంటున్నారు. దీని వల్ల బ్యాక్టీరియాలు తొలగిపోయి రోగాలను అరికట్టవచ్చని చెబుతున్నారు. భార్య భర్తల కలయికలో ఏదైన నొప్పి, మీ ప్రైవేటు భాగాల చూట్టూ ఏవైనా గాయాలు, మంట, లేదా దురదలాంటివి కలిగినప్పుడు మీ దగ్గరలోని గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
కండోమ్‌ను తొలగించండి :
సెక్స్‌లో పాల్గొన్న తరవాత కచ్చితంగా కండోమ్‌ను తొలగించండి. వాడిన కండోమ్‌ను ఏదైనా కవర్‌లో కాని, పేపర్‌లో కాని చుట్టి చెత్త బుట్టలో పడేయండి.
వీర్యం కోల్పోతే బలహీనమవుతారా? అపోహలు, వాస్తవాలు!
త్వరగా నిద్రలేవలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించారంటే అలారం లేకుండానే మేల్కొంటారు!