ETV Bharat / sukhibhava

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

Gut Health Damage Foods : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం అనేక రకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పేగులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మీరు అలాంటి ప్రాబ్లమ్స్​తో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఆహార పదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. దాంతో గట్ ఆరోగ్యం బావుంటుంది. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gut Health Damage Foods
Gut Health Damage Foods
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 2:00 PM IST

These Foods Can Damage Gut Health : పేగులు అనారోగ్యానికి గురికావడం వల్ల క్రోనస్​ వ్యాధి, ఎండోక్రైన్ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. ఇంకా.. పెద్దల పేగులలో వాపు, క్యాన్సర్ వంటి ముప్పు పెరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే అని చెప్పుకోవచ్చు. అయితే.. ముఖ్యంగా కొన్ని ఆహారాలు, పానియాలు తీసుకోవడం కారణంగా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Gut Health Damage Foods : మన శరీరంలో పేగులు సరిగ్గా పనిచేయకపోతే మొట్టమొదటగా ప్రభావితమయ్యేది జీర్ణ వ్యవస్థ. అయితే పేగుల ఆరోగ్యం మనం తినే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని ఫుడ్స్(Foods) పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపి.. అవి సక్రమంగా పనిచేయకుండా చేస్తాయి. దాంతో ఒక్కసారిగా జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. మరి పేగుల ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • మీ పేగుల ఆరోగ్యం మంచిగా ఉండాలంటే.. మీరు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిల్లో కేలరీలు, అనారోగ్య కొవ్వులు, చక్కెర పదార్థాలు అధికంగా ఉంటాయి. మీరు వాటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా.. పేగులకు హాని కలిగే ప్రమాదం ఉంది.
  • అలాగే గట్ సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే మీరు జంక్ ఫుడ్​కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫుడ్​ కూడా అధికంగా కేలరీలు, కొవ్వులు, చక్కెరలు, ఉప్పను కలిగి ఉంటుంది.
  • మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకంటున్నట్లయితే మలబద్ధకం, విరేచనాలు, ఇతర పేగు సమస్యలకు దారితీయవచ్చు.
  • ఇకపోతే అధికంగా కొవ్వు, కెరోటిన్ కలిగి ఉండే ఆహారాలు కూడా పేగు ఆరోగ్యానికి హానికరం. వీటికి కూడా దూరంగా ఉండడం ఉత్తమం.
  • ఇవి తీసుకుంటే పేగులలో ఫిటిబీన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే పేగు తిమ్మిరి, ఇతర సమస్యలకు కూడా దారితీయవచ్చు.
  • ముఖ్యంగా మీరు పేగుల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఆల్కహాల్​కు దూరంగా ఉండాలి.
  • మీరు మద్యం ఎక్కువగా తీసుకోవడం ద్వారా గట్ మైక్రోబ్​కు అంతరాయం కలుగుతుంది. అలాగే మీ గట్ లైనింగ్​ను కూడా ప్రభావితం చేస్తుంది.​

ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

  • మీరు అతిగా తింటున్నా, తక్కువగా ఆహారం తీసుకుంటున్నా మీ పేగుల ఆరోగ్యానికి హాని చేసినట్లే. కాబట్టి మీ గట్‌ హెల్త్‌ను రక్షించుకోవడానికి, సరైన ఆహార విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యం.
  • మీ పేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి.. ఫైబర్‌ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసకృతులు, ఓట్స్‌ వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
  • డీహైడ్రేషన్‌ కూడా మీ గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.
  • అందుకే మీ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ తగినంత నీరు తాగండి. అదేవిధంగా డైలీ కనీసం 30 నిమిషాలపాటు శారీరకంగా శ్రమ ఉండేలా చూసుకోండి.
  • పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారపదార్థాలకు దూరంగా ఉంటూ.. పైన పేర్కొన్న విధంగా మీరు ఫాలో అయ్యారంటే మీ గట్ హెల్త్ మంచిగా ఉండడమే కాదు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Avoid These Habits After Meal : తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..!

రాత్రి భోజ‌నం త‌ర్వాత న‌డ‌క త‌ప్ప‌నిస‌రా?.. ఎంత‌సేపు న‌డ‌వాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.