విద్యార్ధినీ, ఉద్యోగినీ, వ్యాపారవేత్త(concnetrate tips).. జీవితంలో మనం పోషించే పాత్ర ఏదైనా సరే ఏకాగ్రత తప్పనిసరి! ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఏకాగ్రత కొరవడుతుంది. అయితే ఈ సమస్యను(how to concentrate) అధిగమించి పనిపై తదేక ధ్యాస నిలపడమెలానో తెలుసుకుందాం.
ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వారి వంక చూస్తూ జాగ్రత్తగా వినాలి. ఏదైనా విషయం అర్థం కాకపోతే మరోసారి చెప్పమని గానీ నెమ్మదిగా మాట్లాడాలని గానీ అడగాలి.
ఆయా విషయాలను అర్థం చేసుకోవటం, వాటిని మళ్లీ మననం చేసుకోవటం జ్ఞాపకశక్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు 'రాత్రి 8 గంటలకు హోటల్లో గానీ 9.30కు దాబాలో గానీ భోజనం చేద్దాం' అని ఎవరైనా ఆహ్వానిస్తే.. 8 గంటలకు హోటల్లో కలుద్దామా? 9.30కు దాబాలోనా?' అని అడిగితే బాగా గుర్తుంటుంది.
ఇతర విషయాలపై మనసు మళ్లకుండా ప్రశాంతంగా ఉండే చోట మాట్లాడేందుకు ప్రయత్నించాలి. గందరగోళంగా ఉండే హోటళ్లు, రెస్టారెంట్లకు బదులు ఇంట్లో కలుసుకోవచ్చు. హోటల్లోనే కలుసుకునేట్టయితే గోడకు ఆనుకున్న కుర్చీలో కూచోవటం మంచిది. మీతో మాట్లాడే వ్యక్తి వీపు గోడ వైపు ఉండేలా చూసుకోవాలి. దీంతో అటూ ఇటూ వెళ్లేవారిపై దృష్టి మళ్లకుండా ఉంటుంది.
ఒకేసారి రెండు మూడు కాకుండా ఒకే పనిని చేయటం ఉత్తమం. దీంతో మనసు దాని మీదే లగ్నమవుతుంది. ఉదాహరణకు మీరు ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే.. చదవటం పూర్తయ్యాకే చేస్తానని చెప్పాలి.
ఇదీ చూడండి: Health Tips: తరుచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారా..? అయితే ఇలా చేయండి..!