ETV Bharat / sukhibhava

ప్రపంచ పండ్లు, కూరగాయల ఏడాదిగా 2021: ఐరాస

శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు తాజా పండ్లు, కూరగాయలు ద్వారా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ విషయం తెలిసిన వారి కంటే.. తెలియని వారే అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలపై మరింత అవగాహన కల్పించాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించింది. అందులో భాగంగా 2021 ఏడాదిని అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం. వాటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

పండ్లు, కూరగాయలు
Fruits and Vegetables
author img

By

Published : Feb 1, 2021, 6:20 PM IST

Updated : Feb 2, 2021, 11:03 AM IST

పండ్లు, కూరగాయలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యానికి ఎంతో దోహదం చేసే.. వాటిని తీసుకోవాలని డాక్టర్లు, పోషకాహార నిపుణులు సైతం సిఫార్సు చేస్తుంటారు. ఆకుకూరల నుంచి జ్యుసి సిట్రస్ పండ్ల వరకు ప్రతి ఒక్కటి చాలా పోషకాలతో పాటు వాటి సొంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ఉపయోగాల గురించి తెలిసిన వాళ్ల కంటే తెలియని వారే అధికంగా ఉంటారు. ఈ క్రమంలో తాజా పండ్లు, కూలగాయలు తీసుకోవడం వల్ల కలిగి లాభాల గురించి మరింత అవగాహన కల్పించాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు 2021 ఏడాదిని అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం(ఐవైఎఫ్‌వీ)గా ప్రకటించింది.

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తన ప్రచారాన్ని ప్రారంభిస్తూ.. పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైన, వైవిధ్యమైన ఆహారానికి మూలస్తంభాలని పేర్కొన్నారు. ఇవి మానవ శరీరానికి పోషకాలను సమృద్ధిగా అందించటంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయన్నారు. పండ్లు, కూరగాయల్లో అధిక పోషకాలు ఉన్నప్పటికీ వాటిని తగినంతగా వినియోగించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐవైఎఫ్​వీ ఐవైఎఫ్​వీ లక్ష్యం:

ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ఐవైఎఫ్​వీ-21 లక్ష్యాలు ఇలా ఉన్నాయి:

  1. పండ్లు, కూరగాయల వినియోగం ద్వారా పోషణ, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెంచడం
  2. పండ్లు, కూరగాయల వినియోగం ద్వారా వైవిధ్యభరితమైన, సమతుల్య, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం
  3. ఆహార వ్యవస్థల్లో పండ్లు కూరగాయల నష్టాలు, వ్యర్థాలను తగ్గించడం
  4. వ్యర్థాలను తగ్గించడం కోసం ఉత్తమ పద్ధతులను ఎంచుకోవడం
  5. పండ్లు, కూరగాయల ఉత్పత్తిని స్థిరంగా ఉంచుతూ.. వాటి వినియోగం ద్వారా మెరుగైన ఆహార వ్యవస్థను ప్రోత్సహించడం
  6. నిల్వ, రవాణా, వాణిజ్యం, ప్రాసెసింగ్, రిటైల్, వ్యర్థాల తొలగింపు, రీసైక్లింగ్, ప్రక్రియల ద్వారా వాటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడం
  7. పండ్లు, కూరగాయలను పండించే చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ.. వారి ఉత్పత్తులను ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విపణులకు అనుసంధానుంచేటట్లుగా చర్యలు తీసుకోవడం, తద్వారా వారి ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచడం.
  8. అభివృద్ధి చెందుతున్న దేశాలు అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పండ్లు, కూరగాయల సాగులో కలిగే నష్టాలను ఎదుర్కోవడం. అవలంబించాల్సిన నూతన పద్దతులను బలోపేతం చేయడం.

పండ్లు, కూరగాయలు ఎందుకు ముఖ్యం?

Benefits of fruits and vegetables
ప్రపంచ పండ్లు, కూరగాయల సం.

పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచు, అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. పండ్లు, కూరగాయలు తగిన పరిమాణంలో ప్రతి రోజు తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ల బారిన పడకుండా నివారించడంలో సహాయపడతాయి. పండ్లు, కూరగాయలు తగినంతగా తీసుకోకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 14శాతం జీర్ణశయ పేగు క్యాన్సర్, 11శాతం గుండె జబ్బులు, 9శాతం స్ట్రోక్ లతో మరణాలు సంభవిస్తున్నాయని అంచనా.

డబ్ల్యూహెచ్ఓ/ ఎఫ్​ఏఓ నివేదికలో.. అభివృద్ధి అంతగా లేని దేశాల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు, పోషకాహర లోపం వల్ల వచ్చే అనేక వ్యాధుల నివారణకు ఉపశమనం కోసం రోజూ కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు వినియోగించాలని సిఫార్సు చేయబడింది(బంగాళాదుంపలు,ఇతర పిండి దుంపలు మినహా).

అందువల్ల పండ్లు, కూరగాయల వినియోగాన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ప్రోత్సహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు కూడా దీని గురించి అవగాహన కల్పించాలి. ప్రతిరోజూ తగినంత మొత్తంలో వినియోగించకపోతే ఎదురయ్యే కష్టాలను అర్థమయ్యేలా వాటి ప్రాముఖ్యతను వివరించాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవితానికి వారి ఆహరంలో పండ్లు, కూరగాయలు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి.

Last Updated : Feb 2, 2021, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.