ETV Bharat / sukhibhava

Vitamin D: మీలో ఈ లక్షణాలుంటే విటమిన్​ 'డి' లోపం ఉన్నట్లే.. - Vitamin D

కొవ్వుతో కూడిన చేపల వంటి వాటిల్లోనూ విటమిన్‌ డి(Vitamin D) ఉన్నప్పటికీ ఆహారం ద్వారా దీన్ని తగినంత తీసుకోవటం చాలా కష్టం. శరీరంలోని పలు వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపే విటమిన్‌ డి లోపంతో ఎంతోమంది బాధపడుతున్నారు. కొన్ని కొన్ని లక్షణాల ఆధారంగా దీని లోపాన్ని గుర్తించొచ్చు.

Vitamin D
విటమిన్​ 'డి'
author img

By

Published : Jun 14, 2021, 10:30 AM IST

Updated : Jun 14, 2021, 11:41 AM IST

విటమిన్‌ డి(Vitamin D) తీరే వేరు. అవటానికిది విటమినే అయినా హార్మోన్‌ మాదిరిగా పనిచేస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు కొలెస్ట్రాల్‌ నుంచి దీన్ని మన శరీరమే తయారుచేసుకుంటుంది. కొవ్వుతో కూడిన చేపల వంటి వాటిల్లోనూ విటమిన్‌ డి ఉన్నప్పటికీ ఆహారం ద్వారా దీన్ని తగినంత తీసుకోవటం చాలా కష్టం. శరీరంలోని పలు వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపే విటమిన్‌ డి లోపంతో(Vitamin D Deficiency) ఎంతోమంది బాధపడుతున్నారు. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవటం వల్ల చాలామంది దీన్ని పట్టించుకోవటం లేదు. నిజానికి విటమిన్‌ డి లోపం పలు సమస్యలకు దారితీయొచ్చు. కొన్ని కొన్ని లక్షణాల ఆధారంగా దీని లోపాన్ని గుర్తించొచ్చు.

తరచుగా జబ్బుపడటం: రోగనిరోధక వ్యవస్థ బలంగా పనిచేయటంలో విటమిన్‌ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే కణాలతో ఇది నేరుగా చర్య జరుపుతుంది. అందువల్ల విటమిన్‌ డి లోపిస్తే జలుబు, ఫ్లూ వంటివి తరచుగా దాడిచేస్తుంటాయి.
నిస్సత్తువ: అలసట, నిస్సత్తువకు దారితీసే అంశాల్లో విటమిన్‌ డి లోపం ఒకటి. దురదృష్టవశాత్తు చాలామందికి విటమిన్‌ డి లోపమన్నదే గుర్తుకురాదు. రక్తంలో దీని స్థాయిలు తగ్గితే తీవ్రమైన నిస్సత్తువకు దారితీస్తుంది.
వెన్నునొప్పి: ఎముకల దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్‌ డి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మనం తిన్న ఆహారం నుంచి శరీరం క్యాల్షియాన్ని మరింత ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల విటమిన్‌ డి లోపిస్తే వెన్నునొప్పి, ఎముకల నొప్పుల వంటివి బయలుదేరొచ్చు. దీని లోపంతో చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగే ప్రమాదముంది.
కుంగుబాటు: ఎప్పుడూ విచారంతో ఉంటున్నట్టు గమనిస్తే విటమిన్‌ డి లోపం కూడా కారణం కావొచ్చని అనుమానించాలి. రక్తంలో విటమిన్‌ డి స్థాయులు తగ్గటానికీ కుంగుబాటుకూ సంబంధం ఉంటున్నట్టు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
పుండ్లు మానకపోవటం: ఏదైనా దెబ్బ తగిలినపుడు, సర్జరీల వంటివి చేయించుకున్నప్పుడు గాయం, కోతలు త్వరగా మానకుండా వేధిస్తుంటే విటమిన్‌ డి లోపం ఉందేమో ఒకసారి పరీక్షించుకోవటం మంచిది. ఎందుకంటే పుండు మానే క్రమంలో కొత్త చర్మం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించే రసాయనాల ఉత్పత్తికి విటమిన్‌ డి తోడ్పడుతుంది మరి. అంతేకాదు, వాపు నియంత్రణలోనూ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటంలోనూ ఇది పాలు పంచుకుంటుంది.
జుట్టు ఊడటం: వెంట్రుకలు ఊడిపోతుంటే ముందుగా ఒత్తిడే గుర్తుకొస్తుంది. కానీ కొన్ని జబ్బులతో పాటు విటమిన్‌ డి లోపం సైతం జుట్టు ఊడిపోవటానికి దోహదం చేయొచ్చు.

ఇదీ చదవండి:మీ ఆహారంలో 'బీ' ఉందా?

శనగలతో.. ఇలా రోగనిరోధక శక్తి పెంచుకోండి!

Last Updated : Jun 14, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.