ఇందులో కెలొరీలు తక్కువ. సుమారు వందగ్రాముల స్వీట్‌కార్న్ తీసుకుంటే దానివల్ల అందే కెలొరీలు కేవలం ఎనభైఆరు మాత్రమే. ఈ గింజల్లో డైటరీ ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజల్లో ఫెరులిక్ ఆమ్లం అనే పదార్థం ఉంటుంది. ఇది కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడమే కాకుండా వార్థక్యపు ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.
* వయసు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించడం మొదలు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడంలో స్వీట్‌కార్న్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జియాక్సాంథిన్ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
* స్వీట్‌కార్న్ తియ్యగా ఉన్నా...ఇందులో తీపిశాతం తక్కువే. దీన్నితింటే జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా మారుతుంది. దానికి కారణం ఇందులో ఉండే పీచే. అలాగే ఇందులో మేలు చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. పైగా ఇది గ్లూటెన్ ఫ్రీ పదార్థం కూడా. కాబట్టి గ్లూటెన్ పడని వారు దీన్ని తీసుకోవచ్చు.
* ఈ గింజల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. రక్తహీనతను పోగొడుతుంది. ఇక థయామిన్ మెదడుని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతుంది.