Sweet Potatoes Benefits in Telugu: మొరంగడ్డ, చిలగడ దుంప, స్వీట్ పొటాటో.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పేరు ఏదైనా, ఆహారప్రియులకు ఎంతో ప్రీతికరమైన దుంపలివి. నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే ఈ దుంపలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా చిలగడ దుంపలు ఎరుపు, గులాబీ రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువ చలికాలంలో అందుబాటులో ఉంటాయి. రుచిగా ఉండే వీటిని.. కొంతమంది పచ్చిగా తింటే.. మరి కొంత మంది ఉడకబెట్టి తింటారు. సాయంత్రం వేళ స్నాక్ లాగా చిలగడ దుంపలను తీసుకుంటారు. మరి ఈ దుంపలో ఉన్న ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..
చిలగడ దుంపలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు:
Sweet Potato Health Benefits:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..: చిలగడ దుంపలను రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వీటిని శుభ్రంగా కడిగి ఉడకబెట్టిన తరవాత తొక్క తీసేసి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినవచ్చని చెబుతున్నారు. బ్రేక్‌పాస్ట్‌లో తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. వీటిలో పిండి పదార్థం.. కడుపు నిండిన భావనను కలిగిస్తుందంటున్నారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది : చిలగడ దుంపల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చెయ్యడమే కాదు.. దాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అంటున్నారు.
చలికాలంలో చన్నీటి స్నానం చేస్తున్నారా! ఈ ప్రమాదాలు తెలుసా?
జీర్ణ సమస్య తగ్గుతుంది: ఒక చిలగడ దుంపను రోజు తినడం వల్ల శరీరానికి 15 శాతం ఫైబర్ అందుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. మల బద్ధకం సమస్యతో బాధపడేవారికి దీన్ని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా..: చిలగడ దుంపలో ఎక్కువ మొత్తంలో పిండి పదార్థం ఉంటుంది. దీనివల్ల సాధరణ పిండి పదార్థాలతో పోలిస్తే ఇది జీర్ణం అవటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో మన రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే మానసికంగా స్థిరంగా ఉండటంలో చిలగడ దుంప సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
బూస్టర్‌లా పనిచేస్తుంది..: కంటి సమస్యలతో బాధపడేవారు చిలగడ దుంపను తినడం వల్ల మంచి దృష్టి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరిగిన ఎముకలు దృఢంగా అవుతాయని.. తరచూ తినటం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు.
చిలగడ దుంపలను ఎక్కువగా తినటం వల్ల పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, వీటిలో పిండి పదార్థాలు ఉండటం వల్ల మధుమేహంతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దుంపల్లో ఆక్సలేట్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కిడ్నీలో రాళ్లున్న వాళ్లు తక్కువగా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
టమాటాలు ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉండాలా? - ఇలా చేస్తే చాలా రోజులు ఉంటాయి!
వాకింగ్‌తో వెయిట్ లాస్- వారంలో ఎన్ని రోజులు, ఎంత సేపు నడవాలి?