Sweet Corn Health Benefits in Telugu : ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవన శైలితో పాటే ఆహార అలవాట్లలో భారీగా మార్పులు జరుగుతున్నాయి. దీంతో డయాబెటిస్, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు, కంటి సమస్యలు, అధిక బరువు ఇలా రకరకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొందరు.. వీటన్నింటి బారిన పడకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అయితే మనం రోజూ వారీ ఆహారంలో స్వీట్‌కార్న్ చేర్చుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవని అంటున్నారు.
Benefits Of Sweet Corn In Telugu
స్వీట్‌కార్న్ ఉపయోగాలు..
1. పోషకాలు
స్వీట్‌కార్న్‌లో సరైన మోతాదులో ఫైబర్ (పీచు పదార్థం) సహా మన శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్ ఏ, బీ-కాంప్లెక్స్, సీతో పాటు పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు.. స్వీట్‌కార్న్‌లో పుష్కలంగా ఉంటాయి.
![sweetcorn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-09-2023/19580524_sweetcorn-6.jpg)
2. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు
స్వీట్‌కార్న్‌లో లుటీన్, జియాక్సాంటిన్ వంటి యాంటీఆక్సిడెంట్ల ఉంటాయి. ఇవి వయసు పైబడుతుంటే వచ్చే కంటి సంబంధిత వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతాయి.
3. జీర్ణసమస్యలకు చెక్
స్వీట్‌కార్న్‌లో ఉండే పీచు పదార్థం.. మన శరీరంలో అతి ముఖ్యమైన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చెయ్యడానికి ఉపయోగపడతుంది. మలబద్దకాన్ని నిరోధించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
4.స్వీట్‌కార్న్ డైట్
బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో స్వీట్‌కార్న్‌ను తప్పకుండా చేర్చుకోవాలి. వాటిలో ఉండే ఫైబర్ కారణంగా మనం కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి స్వీట్‌కార్న్ తినడం వల్ల బరువు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
![sweetcorn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-09-2023/19580524_sweetcorn-5.jpg)
5. స్వీట్‌కార్న్‌తో సేఫ్ హార్ట్
స్వీట్‌కార్న్‌లో ఉండే ఫోలెట్ (ఒక రకమైన బీ విటమిన్).. రక్తనాళాలలోని హోమోసిస్టీన్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె వ్యాధుల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
Sweet Corn Healthy Or Not :
నోట్- అయితే స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనదే అయినప్పటికీ.. దాంతోపాటు ఎక్కువ మోతాదులో బటర్, ఉప్పు, నూనె పదార్థాలను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందలేమని నిపుణులు తెలిపారు.