ETV Bharat / sukhibhava

శృంగారంలో చెమట ఆ బలహీనతకు సంకేతమా?

Sweat In Sex: శృంగారం చేసే సమయంలో కొందరికి చెమట బాగా వస్తుంది. అయితే ఇలా రావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది నరాల బలహీనతకు సంకేతమని ఆందోళన చెందుతారు. మరి దీనిపై నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

sex
శృంగారం
author img

By

Published : Apr 6, 2022, 7:15 AM IST

Sweat In Sex: శృంగారంలో పాల్గనే వారిలో పలు సందేహాలు రావడం సహజం. కొందరు అయితే అనుమానాలతో ఆందోళన చెందుతుంటారు. సెక్స్​ చేసే సమయంలో చెమట పట్టడంపై కూడా ఇదే విధంగా పలువురు ఆందోళన చెందుతుంటారు. ఒళ్లంతా ఇలా చెమటలు పట్టడం నరాల బలహీనత అని.. ఇది శృంగారంపైన కూడా ప్రభావం చూపిస్తుందని భావిస్తుంటారు. మరి వీరి అనుమానాల్లో నిజమెంత? చెమట పట్టడానికి నరాల బలహీనతకు సంబంధం ఉందా?

నిపుణులు ఏం అంటున్నారంటే.. చెమట ఎక్కువగా వస్తే నరాల బలహీనత అనుకోవడం అపోహ మాత్రమే. నరాల బలహీనతకు, రతికి అసలు సంబంధం లేదు. కంగారు, ఆందోళన ఉన్నవారికి చెమట అధికంగా వస్తుంది. అలాగే హైపర్​ థైరాయిడ్​ ఉన్నవాళ్లకు ఎక్కువగా చెమట పడుతుంది. మరికొందరికి సహజంగానే చెమట ఎక్కువ వస్తుంది. అది జబ్బు కాదు. అయితే చెమట ఎక్కువగా వచ్చేవారు.. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అంటే చెమట వల్ల ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసార్లు స్నానం చేయడం. డస్ట్ పౌడర్​ వంటివి వాడటం వల్ల చర్మ వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇదీ చూడండి: శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.