ఈ వయసులో నిద్రపట్టకపోవడం ఏమిటీ మరీ విడ్డూరం కాకపోతే అని ఇరవయ్యేళ్ల పిల్లల్ని ఉద్దేశించి పెద్దవాళ్లు అనుకోవచ్చుగాక. కానీ నిద్రలేమి అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. సాధారణంగా ఏ మనిషికైనా రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేదంటే కనీసం నాలుగైదుగంటలన్నా ఉండాలి. అయితే అదీ చాలామందికి దొరకడం లేదు. నిద్రలేమి జీవక్రియమీదా, హార్మోన్లమీదా తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా ఆలోచనాశక్తి తగ్గడమే కాదు, శరీరమూ స్వాధీనంలో ఉండదు. అలసిన మెదడు కణాలన్నీ నిద్రలోనే తిరిగి శక్తిని పుంజుకుంటాయి. అప్పటివరకూ తెలుసుకున్న విషయాలన్నింటినీ మెదడు గుర్తుపెట్టుకునేలా చేయగలిగే శక్తి నిద్రకి మాత్రమే ఉంది. నిద్ర ఏకాగ్రతనీ నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్నీ ఇస్తుంది. సృజనాత్మకతనీ పెంచుతుంది.
అదే నిద్రలేమితో బాధపడేవాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించడం, డిప్రెషన్, ఆందోళన, కోపం, అతిగా తినడం, గందరగోళం... వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. నిద్రలేమి గుండెమీద ప్రభావాన్ని కనబరుస్తుంది. సెరటోనిన్, ఈస్ట్రోజెన్, మెలటోనిన్, కార్టిసాల్, టెస్టోస్టెరా ఇన్సులిన్... వంటి హార్మోన్లలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ లోపంతో ఆకలి పెరిగి, ఊబకాయానికి దారితీస్తుంది. దాంతో మధుమేహం, హృద్రోగాలు, మూత్రపిండాల సమస్యలు, పక్షవాతం... వంటివన్నీ తలెత్తుతాయి. మొత్తంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనమై రకరకాల ఇన్ఫెక్షన్లూ సోకుతాయి. ఇది పొట్టలోని బ్యాక్టీరియామీదా ప్రభావాన్ని కనబరచడంతో శరీరంలోని వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. అందుకే దీన్ని పరిష్కరించేందుకు ‘సునిద్ర’ చికిత్సా విధానాన్ని రూపొందించింది సుఖీభవ.
చికిత్సా విధానం!
ఏ జబ్బు నివారణకైనా నియమాల్ని పాటిస్తూ సరైన ఆహారం తీసుకోవడమే మంచి మందు. కాబట్టి వ్యక్తి జీవనశైలి, జీర్ణశక్తిని బట్టి ఆహారాన్ని సూచించడం ద్వారా సునిద్ర చికిత్స మొదలవుతుంది. ఆల్కహాల్, కెఫీన్, నికోటిన్ వంటివన్నీ నిద్రలేమికి దారితీస్తాయి. ప్రాసెస్డ్ ఆహారపదార్థాలూ సోడాలూ కూల్‌డ్రింకులూ స్వీట్లూ డెజర్ట్‌లూ నిద్రమీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వాటిని పూర్తిగా మానేలా శిక్షణ ఇస్తాం. తాజా కూరగాయలు, చిక్కుళ్లు, బీన్స్, అలసందలు, సోయా... ఇలా విటమిన్లూ ప్రొటీన్లూ ఉండే వాటిని తీసుకుంటే పొట్టలో బ్యాక్టీరియా మెరుగై జీర్ణశక్తి పెరగడంతోపాటు నిద్ర పట్టేందుకూ దోహదపడతాయి. అంటే- ఆహారంలో ప్రొబయోటిక్, ఫెర్మెంటెడ్ పదార్థాలూ పండ్లూ నట్సూ తృణధాన్యాలూ పెరుగూ ఉండేలా చూస్తాం. సునిద్ర చికిత్సా విధానంలో భాగంగా ఆహారంతోపాటు నేచురోపతీ, ఆయుర్వేద వైద్యాన్నీ అందిస్తుంది సుఖీభవ.
మంచి నిద్రకి పరిసరాలూ కారణమే. గది ఉష్ణోగ్రత మరీ చల్లగానో వేడిగానో ఉంటే దాని ప్రభావం జీవగడియారంమీద పడి నిద్ర మధ్యలో మెలకువ వచ్చేస్తుంటుంది. కాబట్టే లైట్లూ శబ్దంలేని ప్రశాంత వాతావరణం, సమ ఉష్ణోగ్రత ఉన్న గదిలో గాఢనిద్రలోకి వెళ్లేలా చికిత్స అందిస్తాం. అయితే పగటివేళలో సరిపడా సూర్యకాంతి శరీరానికి తగిలినప్పుడే నిద్రకు కారణమయ్యే మెలనిన్ హార్మోన్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఈ మెలనిన్ లోపమే చాలామందిలో నిద్రలేమికి కారణమవుతుంది. అందుకే సుఖీభవలో కొన్ని రకాల స్నానాల ద్వారా శరీరానికి కాంతి తగిలేలా చేసి ఆ హార్మోన్ ఉత్పత్తయ్యేలా చేస్తున్నారు. కొన్ని కేసుల్లో మూలికలతో కూడిన నూనెలూ పాలూ పెరుగూ కషాయాలతో కూడిన శిరోధార చికిత్స చేయడం ద్వారా నాడుల్ని ప్రేరేపించి మంచి నిద్ర పట్టేలా చేస్తారు.
రకరకాలుగా..!
హైపోథైరాయిడిజంతో బాధపడేవాళ్లలో కూడా నిద్రలేమి కనిపిస్తుంటుంది. ఐతే సమస్య ఏదైనా చికిత్సా విధానం వ్యక్తి గతమే. కాబట్టి వాళ్ల శరీర తత్వాన్ని బట్టి జీవనశైలిలో మార్పులు చేస్తాం. కొందరికి రకరకాల ఆలోచనలూ మానసిక సమస్యల వల్ల కూడా నిద్రలేమి రావచ్చు. అలాంటివాళ్లకి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ప్రశాంతంగా ఆలోచించేలా ధ్యానం చేయించడం, యోగాసనాలు వేయించడంతోపాటు కొన్ని రకాల శ్వాస పద్ధతుల్నీ నేర్పిస్తాం. అంతేకాదు, యోగ నిద్రకు సంబంధించిన ఆసనాల్నీ వేయిస్తాం. కొన్ని రకాల పూల తైలాల్నీ సూచిస్తాం. పేషన్ ఫ్లవర్, అశ్వగంధ వంటి మూలికల్నీ వాడాల్సి ఉంటుంది.
వెన్నెముకకి హాట్ ప్యాక్‌లు వేయడం, ఎప్సమ్ సాల్ట్‌తో కూడిన కొన్ని హాట్ ఫుట్‌బాత్‌ల వల్ల కూడా మంచి నిద్ర పట్టేలా చేయవచ్చు. రెండుమూడు సెషన్ల తరవాత వీటిని ఎవరికి వాళ్లు ఇంట్లోనే చేసుకునేలా శిక్షణ ఇస్తాం. పడుకునేముందు లావెండర్ నూనెను పీల్చడం వల్లా నిద్ర మెరుగవుతుంది. నిద్రలేమితో బాధపడే మధ్యవయస్కులకి ముఖ్యంగా మెనోపాజ్‌తో బాధపడుతోన్న మహిళలకి ఈ రకమైన అరోమాథెరపీ మంచి ఫలితాన్నిస్తుంది. అందుకే కారణాన్ని తెలుసుకుని సరైన చికిత్సను అందించడం ద్వారా ఎవరికైనా హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది సుఖీభవ.
- ఇదీ చూడండి : రాత్రిపూట ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు