ETV Bharat / sukhibhava

ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా?.. ఫోన్​ను దూరం పెడితే అంతా సెట్​!

author img

By

Published : May 1, 2023, 10:10 AM IST

ప్రస్తుత కాలంలో అందరి జీవితాలు ఉరుకులు పరుగులమయంగా మారిపోయాయి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు విశ్రాంతి లేకుండా రకరకాల పనులతో అందరూ బిజీబిజీగా ఉంటున్నారు. చదువులు, కెరీర్ అంటూ అందరూ ఒక పరుగు పందెంలో అథ్లెట్ల మాదిరిగా పరిగెడుతున్నారు. దీనికి ఎవర్నీ నిందించలేని పరిస్థితి. పోటీ ప్రపంచంలో ఆమాత్రం దూకుడుగా లేకపోతే ముందుకెళ్లలేం. అయితే ఇలాంటి జీవనశైలి వల్ల రకరకాల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రపోకపోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల చాలా మంది లేనిపోని రోగాల బారిన పడుతున్నారు.

stress management tips and tricks
stress management tips and tricks

Stress Management Tips : ఒకప్పటితో పోలిస్తే ఒత్తిడి అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొత్త ఒత్తిడి ఉండటం సహజమే. అయితే ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఒకే సమయంలో రకరకాల బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా పనిచేసే వారికి ఒత్తిడి మరింత అధికంగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాస్త శ్రద్ధపెడితే ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

వ్యాయామం తప్పనిసరి
ఒత్తిడిని తగ్గించే అంశాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యాయామం. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారం మొత్తంలో రెండున్నర గంటల పాటు బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేయొచ్చు. ఇది వద్దనకుంటే.. వారంలో 75 నిమిషాల పాటు శరీరానికి మరింత శ్రమనిచ్చే స్విమ్మింగ్, జాగింగ్ లాంటివి చేసినా మంచి ఫలితం ఉంటుంది. మీకు నచ్చిన లేదా అనుకూలంగా ఉన్న వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురైనప్పుడు మన కండరాల్లో టెన్షన్ ఉంటుంది. అప్పుడు వేడినీటితో స్నానం చేస్తే మేలు కలుగుతుంది. దీర్ఘ శ్వాస తీసుకుంటూ చేసే ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలతో కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఈ వ్యాయామాల్లో ముఖ్యంగా నిదానంగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ.. ఇలా ఐదు నుంచి పది నిమిషాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిద్రపోయే ముందు అవి చేయొద్దు
'ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త నిద్ర. ఈ రోజుల్లో చాలా మంది 2 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఆ సమయం కూడా పూర్తిగా నిద్రపోరు. మధ్యలోనే లేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరు రోజుకు కనీసం 6 గంటల పాటు నిద్రపోవాలి. కుదిరితే 8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర వల్ల మెదడుతో పాటు శరీరంలోని కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. నిద్రకు ఉపక్రమించే గంట లేదా రెండు గంటల ముందు కాఫీ లాంటివి అస్సలు తాగకూడదు. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం కూడా చాలా ఉపకరిస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు ఒత్తిడి దానంతట అదే తగ్గుతుంది' అని ప్రముఖ వైద్యులు డాక్టర్ కె.ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఒత్తిడితో సతమతం అవుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

పనులను విభజించుకోవాలి
ఒత్తిడిని నివారించేందుకు మరికొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఉన్న గడియారాలను ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫాస్ట్​గా నడిచేలా పెట్టుకోవచ్చు. ఇంటి పనుల్లో ఎక్కువ సమయం పట్టే వాటిని చిన్న చిన్న పనులుగా విభజించుకోవాలి. రోజూవారీ పనులతో అలసిపోయేవారు యోగా, ధ్యానం, ప్రార్థన లాంటి సాధనలకు తగిన సమయం కేటాయించుకోవాలి. సంగీతం వినడం, పచ్చదనంలో కొంచెం సేపు గడపడం ద్వారా కూడా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందొచ్చు. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, నచ్చిన ఆటలు ఆడుకోవడం లాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఫోన్​ను దూరం పెట్టాల్సిందే
'ఒత్తిడిని తరిమికొట్టడానికి వ్యాయామం చేయడం ఎంతో అవసరం. అలాగే ఫోన్​కు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండాలి. నిద్రపోయే రెండు గంటల ముందు నుంచి మొబైల్​కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్​ను ఎంత దూరం పెడితే అంత ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోజూ చెట్ల మధ్య కాసేపు గడపాలి. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోని పిల్లులు, కుక్కలు లాంటి పెంపుడు జంతువులతో ఆడుకోవాలి. రోజూ కనీసం అరగంట సేపు పెంపుడు జంతువులతో ఆడుకుంటే ఒత్తిడి తగ్గుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది' అని డాక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు.

పౌష్టికాహారం కూడా ముఖ్యమే
'మానసిక ఒత్తిడి తగ్గేందుకు రోజూ అరగంట సేపు పూర్తి ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. అలాగే కాసేపు నచ్చిన సంగీతాన్ని వింటూ ఉండాలి. అప్పుడు ఒత్తిడి కలిగించే ఆలోచనల నుంచి దృష్టి మరలుతుంది. వీటన్నింటితో పాటు సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యం. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీని వల్ల కూడా ఒత్తిడి బాగా తగ్గుతుంది. పోషకాలు మెండుగా ఉన్న కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలను తరచూ భోజనంలో తీసుకోవాలి. ఒత్తిడి బాధించకూడదంటే మనసును తేలిగ్గా ఉంచుకోవాలి. మనసును బాధించే విషయాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవాలి. ఎప్పుడు ఏ సమయంలో ఒత్తిడికి గురవుతున్నామో అవగాహన తెచ్చుకోవాలి. దీని వల్ల ఒత్తిడికి కారణం అవుతున్న విషయాలకు, మనుషులకు దూరంగా ఉండే అవకాశం ఉంది' అని డాక్టర్ ప్రవీణ్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.