ETV Bharat / sukhibhava

Stress Management Tips : తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నారా?.. ఈ చిట్కాలతో చెక్​! - ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా

Stress Management Tips In Telugu : నేడు చాలా మంది వివిధ కారణాలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఫలితంగా అనుకున్న పనులు చేయలేక సతమతమవుతున్నారు. అయితే ఈ మానసిక ఒత్తిడికి గల కారణాలు ఏమిటి? ఈ సమస్యను ఎలా నివారించుకోవాలి? మొదలైన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

stress causes
stress management tips
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 8:16 AM IST

Stress Management Tips In Telugu : నేటి ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారు. వాస్తవానికి కొంత పరిమితి వరకు ఒత్తిడి మంచిదే. దీని వల్ల మనం అనుకున్న పనులను సకాలంలో సక్రమంగా పూర్తి చేయడానికి వీలవుతుంది. కానీ మితిమీరిన ఒత్తిడి మాత్రం.. మానసికంగా, శారీరకంగా చేటు తెస్తుంది. కనుక తీవ్రమైన ఒత్తిడిని దరిచేరనీయకుండా జాగ్రత్తపడాలి.

శారీరక సమస్యలు వస్తాయ్!
'మానసికమైన ఒత్తిడిలు ఉన్నప్పుడు చేయాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయలేరు. కేవలం ఐదు నిమిషాల్లో చేయాల్సిన పనిని గంటలు గడుస్తున్నా.. పూర్తి చేయలేకపోతారు. ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతుంటారు. వాస్తవానికి స్ట్రెస్​ ఎక్కువగా ఉంటే.. శారీరకంగానూ అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్​ తప్పిపోతాయి. బీపీ పెరిగిపోతూ ఉంటుంది. బ్లడ్ షుగర్ కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టదు. దీనితో ఎప్పటి నుంచే నిద్రాణమై ఉన్న ఇతర రోగాలు కూడా బయటపడుతూ ఉంటాయి. నిద్రలేమి వల్ల ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అంటే ఒత్తిడి అనేది మెదడుపై మాత్రమే కాదు.. శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది' అని ప్రముఖ న్యూరోఫిజీషియన్​ సీ.హెచ్.గోపాల్​ తెలిపారు.

వాస్తవానికి నిత్యం ఒత్తిడికి గురయ్యే వారు.. తమకు తాము తేలికైన మార్గాల ద్వారా దానిని అదుపులో ఉంచుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు
నిత్యజీవితంలో ఎదుర్కొనే ఒత్తిడిని కొన్ని సులువైన మార్గాల ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. అవి ఏమిటంటే..

  1. వ్యాయామం : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. శరీరం చురుకుగా తయారవుతుంది. దీనితో ఒత్తిడి కూడా చాలా వరకు అదుపులోకి వస్తుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాయామం చేయకుండా ఉంటే.. ఒత్తిడి పెరగడమే కాకుండా.. చిరాకు, మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. నిద్ర లేమి సమస్యలు కూడా ఏర్పడతాయి.
  2. ఆరోగ్యకరమైన ఆహారం : ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలంటే.. సరైన సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారు అవసరం లేకపోయినా.. అధికంగా తింటుంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది. మెగ్నీషియం, బి-విటమిన్స్ లేని ఆహారం తీసుకుంటే.. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదు. ఒత్తిడి తగ్గాలంటే.. కూరగాయలు, పళ్లు, చిక్కుళ్లు, బీన్స్, చేపలు, గింజలు, నట్స్ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
  3. ఫోన్​, ల్యాప్​టాప్​ల వినియోగాన్ని తగ్గించాలి : నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సమయంపాటు సెల్​ఫోన్, ల్యాప్​టాప్​లను వినియోగిస్తున్నారు. దీని వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతోంది. ఇది కూడా ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది. అందుకే వీలైనంత వరకు ఫోన్స్​ లాంటి ఎలక్ట్రానిక్​ డివైజ్​ల వాడకాన్ని బాగా తగ్గించుకోవాలి.
  4. నిద్రపోవాలి : ఒత్తిడి తగ్గాలంటే కచ్చితంగా మంచిగా నిద్ర నిద్రపోవాలి. రోజులో కనీసం 8 గంటల సమయం నిద్రపోవడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
  5. ఔషధాలు : డాక్టర్లు సూచించిన కొన్ని రకాల ఔషధాలు.. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మెగ్నీషియం సప్లిమెంట్స్​ తీవ్రమైన ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఎలాంటి సప్లిమెంట్స్ లేదా మందులు తీసుకోవాలన్నా.. వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి. లేదంటే.. లేనిపోని ఇతర సమస్యలు వచ్చిపడతాయి. జాగ్రత్త!
  6. శ్రద్ధ తీసుకోవాలి : మన పట్ల మనం తీసుకునే శ్రద్ధ కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. మనకు నచ్చిన పనులు చేయడం, ఆడుకోవడం, పిల్లలతో గడపడం, విహరించడం లాంటివి మన ఒత్తిడిని తగ్గిస్తాయి.
  7. యోగా : నిత్యం క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం లాంటివి చేయాలి. వ్యాయామం చేయడం, నడవడం, ఈత కొట్టడం లాంటివి ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తాయి.
  8. పుస్తకాలు : ఉత్తేజం కలిగించే పుస్తకాలు చదవడం, స్ఫూర్తిదాయమైన కథనాలు చదవడం వల్ల కూడా మానసిక ఒత్తిడిని తగ్గుతుంది.
  9. సంగీతం : మంచి ఆహ్లాదకరమైన సంగీతం మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది.
  10. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి : పరిమితి వరకు కాఫీ, టీలు తీసుకోవడం మంచిదే. కానీ అధికంగా కాఫీ, టీ, చాక్లెట్స్​, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే.. కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మితంగా ఉంటే.. ఆరోగ్యానికి మంచిది. మోతాదుకు మించితే అనారోగ్యానికి హేతువు అవుతుంది.
  11. స్నేహితులతో కలిసి సంతోషంగా గడపాలి : చాలా మంది ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, చిన్న పిల్లలతో కలిసిమెలసి సంతోషంగా గడపాలి.
  12. నో చెప్పగలగాలి : మీకు నచ్చని పనులను.. ఇతరులు చేయమని చెప్పినప్పుడు, సున్నితంగా వాటిని చేయలేని చెప్పగలగాలి. లేదంటే.. మీకు నచ్చని పని చేస్తూ, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.
  13. పనులు వాయిదా వేయకూడదు : చాలా మంది బద్ధకంతో, ఇతర కారణాలతో పనులను వాయిదా వేస్తుంటారు. సమయం దగ్గరపడుతున్నప్పుడు.. పని త్వరగా చేయలేక ఒత్తిడికి గురవుతారు. అందుకే బద్ధకాన్ని, వాయిదాలు వేసే మనస్తత్వాన్ని కచ్చితంగా మార్చుకోవాలి.
  14. ప్రేమించే వారితో కలిసి ఉండడం : మనల్ని ప్రేమించే వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం వల్ల కూడా మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది.
  15. ప్రకృతిలో సేద తీరాలి : పచ్చని చెట్లు, పొలాలు, పార్క్​ల్లో, బీచ్​ల్లో స్నేహితులతో కలిసి సరదాగా గడపాలి. అది కూడా ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది.
ఒత్తిడి తగ్గించే మార్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.