ETV Bharat / sukhibhava

refrigerator: ఫ్రిజ్‌ లేకుండానే కూరగాయలు భద్రం - vegetables Storage

మీ ఇంట్లో ఫ్రిజ్(refrigerator) లేదా..? అయితే ఏం పర్లేదండి. కింద ఇచ్చిన కొన్ని చిట్కాలు పాటిస్తూ... మీరు తీసుకొచ్చిన కూరగాయలను(vegetables) భద్రంగా, తాజాగా నిల్వ చేసుకోవచ్చు.

store-vegetables-without-refrigerator
ఫ్రిజ్‌ లేకుండానే కూరగాయలు భద్రం
author img

By

Published : Jul 12, 2021, 10:50 AM IST

తాజా కూరగాయలు (vegetables) తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పని ఒత్తిడిలో రోజూ కొనితెచ్చుకోలేం. ఫ్రిజ్‌లో(refrigerator) ఉన్న కొద్ది స్థలంలో అన్నిటినీ దాయలేం. వీలైతే ఫ్రిజ్‌లో పెట్టొద్దని కూడా చెబుతున్నారు ఆహార నిపుణులు(food exports). ఈ క్రమంలో కొన్ని కూరగాయల్ని బయటే ఎలా జాగ్రత్త చేయొచ్చో చూద్దాం.

  • దోసకాయలు, ఆలుగడ్డ, చిలకడదుంప, చేమదుంప, ముల్లంగి, బీట్‌రూట్‌ లాంటివి ఫ్రిజ్‌లో పెట్టక్కర్లేదు. బయటే చాలారోజులు నిలవుంటాయి. తడి బట్టలో చుట్టి పెడ్తే చాలా రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటాయి.
  • తడి లేని కరివేపాకును గాలి చొరని సీసాలో ఉంచితే పాడవదు.
  • సీసాలో ముప్పావుభాగం వరకూ నీళ్లు నింపి క్యాబేజీని దానిమీద ఉంచితే తాజాగా ఉంటుంది. నీళ్లలో మునగకూడదండోయ్‌.
  • దొండకాయలు పచ్చిగా ఉంటే ఫ్రిజ్‌ అవసరం లేదు.
  • టొమాటోలు కాస్త గట్టివి తీసుకుంటే ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పండినవి వాడుకోవచ్చు. టొమాటోలను ఇంట్లో చల్లగా ఉండే ప్రాంతంలో ఉంచాలి. అన్నింటినీ ఒకే దగ్గరగా కాకుండా దూరం దూరంగా ఉంచితే త్వరగా పాడవకుండా ఉంటాయి.
  • పాత్రలో నీళ్లు పోసి కొత్తిమీర కాడలను అందులో ఉంచితే తాజాగా ఉంటుంది.
  • క్యారెట్లను అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టి, పైన, కింద తెరిచి ఉంచితే నిలవుంటాయి. అలా కాకుండా క్యారెట్ పైభాగాన్ని కత్తిరించి గాలి చొరబడని సీసాలో ఉంచినా చాలా రోజులు తాజాగా ఉంటాయి.
  • వెల్లుల్లి రెబ్బలను గాలి తగలకుండా ఉండే సీసాలో, కవర్​లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
  • బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఎప్పుడూ కలిసి ఉంచవద్దు. రెండింటినీ కలిపి ఉంచితే అవి త్వరగా పాడైపోతాయి. దూరంగా ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
  • కూరగాయలన్నింటినీ ఒకే బుట్టలో వేసి ఉంచినా త్వరగా పాడైపోతాయి. వేటికవి ఉంచుతూ... కూరగాయలు తాజాగా ఉండేలా చూసుకోవాలి.
  • ఆకు కూరలు తొందరగా పాడైపోతాయి. అందుకే కొనేటప్పుడు మంచివి కొనాలి. ఒకవేళ ఎక్కడైనా ఒక ఆకు పాడైతే.. వెంటనే దానిని తీసేయాలి. లేదంటే మిగిలిన ఆకులన్నీ కూడా త్వరగా పాడైపోతాయి.
  • పుదీనా, కొత్తిమీర కట్టలను తీసుకొచ్చిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. పాడైపోయిన ఆకులు, మట్టిని తొలగించాలి. నీళ్లు పోసిన ఓ గిన్నెలో పుదీనా, కొత్తిమీర కట్టలను వేయాలి. వేర్లు మాత్రమే నీటిలో ఉండేలా చూసుకోవాలి. అలా చేస్తే చాలా రోజులు తాజాగా ఉంటాయి.
  • కూరగాయలు కొనేటప్పుడు ఎండినట్లు, వాడినట్లు ఉండేవి తీసుకోకపోవడం, ఇంట్లో ఎండ తగలనిచోట కవర్లలో కాకుండా విడిగా ఉంచడం ప్రాథమిక సూత్రం.

ఇదీ చూడండి: MORINGA: మునగాకుతో ఎన్నో లాభాలో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.