Pregnant Woman Smoking Effects: చాలా మంది పురుషుల్లానే.. కొందరు మహిళలు పొగ తాగడం, మద్యపానం సేవించడం వంటివి చేస్తుంటారు. అయితే.. వారు ఒకవేళ గర్భం దాలిస్తే పుట్టే పిల్లలు ఆరోగ్యంగానే ఉంటారా? అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ప్రముఖ వైద్యులు డాక్టర్. జి సమరం. గర్భిణీలు మద్యం తీసుకున్నా.. స్మోకింగ్ చేసినా.. డ్రగ్స్ తీసుకున్నా.. పుట్టే పిల్లల్లో చాలా రకాల అంగవైకల్యాలు, ఇతర ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు.
''మహిళ మద్యం తీసుకుంటే.. గర్భస్థ శిశువు బ్రెయిన్ డెవలప్ కాదు. చిన్నదిగా ఉంటుంది. అసలు బ్రెయిన్ సెల్స్ సరిగా వృద్ధి చెందవు. అంగవైకల్యాలు ఏర్పడతాయి. అలాగే.. ఒకవేళ స్మోకింగ్ చేస్తే కూడా అంతే. ఎక్కువ స్మోక్ చేస్తే పుట్టే బిడ్డల్లో రకరకాల వైకల్యాలు. అబార్షన్లు కూడా అయిపోతాయ్. అలాగే డ్రగ్స్ తీసుకుంటే.. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయ్. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్గింగ్ ఈ మూడు కూడా గర్భస్థ శిశువుకు చాలా నష్టం చేస్తుంది. ముఖ్యంగా గర్భం దాల్చిన, దాల్చే, దాల్చాలనుకున్న మహిళ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం ముట్టకూడదు. స్మోకింగ్ చేయకూడదు. డ్రగ్స్ తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం పుట్టే బిడ్డకు ఆరోగ్యం మాత్రం చాలా డ్యామేజింగ్‌గా ఉంటుంది.''
- డాక్టర్ జి. సమరం
ఇవీ చూడండి: రోజులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొనవచ్చు? ఎక్కువైతే ఇబ్బందా?
సిగరెట్ తాగడంలో 'తగ్గేదేలే' అంటున్న అమ్మాయిలు
'ఆనందాన్ని ఎవరు కోరుకోరు'.. ఈ సిగరెట్ యాడ్ పాప అందాన్ని ఇప్పుడు చూస్తే..