ETV Bharat / sukhibhava

అలర్ట్ - రాత్రివేళ బెడ్ ఎక్కి ఫోన్​ పట్టుకుంటున్నారా? మీ మెదడులో జరిగే ప్రమాదకర మార్పులివే! - effect on brain due to late sleep

Late Sleeping Side Effects: రాత్రి అన్నం తిని.. బెడ్ ఎక్కి ఫోన్ పట్టుకుంటారు. గడియారం గంటలు కొట్టుకుంటూ వెళ్లిపోతూనే ఉంటుంది. ఫోన్ మాత్రం ఎప్పుడు పక్కన పెడతారో తెలియదు. మీరు కూడా ఇలా చేస్తున్నారా? అయితే.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

Late Sleeping Side Effects
Late Sleeping Side Effects
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 10:57 AM IST

Late Sleeping Side Effects : పని చేస్తే.. మనిషి అలసిపోతాడు. కంపల్సరీ రెస్ట్ తీసుకుంటాడు. మరి.. పనిచేసే మెదడుకు విశ్రాంతి అవసరం లేదా? మనిషి నిద్రపోయినప్పుడే దానికి కాసింత రెస్ట్​ దొరుకుతుంది. కానీ.. జనాలు ఆ ఛాన్స్​ కూడా ఇవ్వట్లేదు. రాత్రి మంచం ఎక్కిన తర్వాత కూడా ఫోన్ పట్టుకొని గంటల తరబడి బ్రెయిన్​పై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల.. గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి వ్యాధులతోపాటు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. 5 ఏళ్లు ఎక్కువ బతుకుతారట!

మెదడులో ఏం జరుగుతుంది?: చాలా మందికి నిద్ర విలువ తెలియదు. దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ.. మెదడుకు నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతేనే బ్రెయిన్ రిపేరింగ్ ప్రాసెస్ మొదలు పెడుతుంది. మెమరీని మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంది. మనిషి కావాల్సినంత నిద్రపోయినప్పుడు.. మర్నాడు హుషారుగా నిద్రలేవడానికి కారణం ఇదే. అంటే.. సర్వీసింగ్ చేస్తుందన్నమాట. అలాంటిది.. మనం నిద్ర పోకుండా మెలకువగా ఉన్నట్లయితే.. అది మనం చెప్పే పని మాత్రమే చేస్తుంది. దాంతో.. శరీర, మానసిక ఆరోగ్యాన్ని రిపేర్​ చేసే సమయం దానికి దొరకదు. దాంతో.. అనేక రోగాలకు ఒంట్లో పుట్టుకొస్తాయి.

రాత్రిళ్లు ఫోన్ వాడకాన్ని తగ్గించే 7 చిట్కాలు.. ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు!

ఎవరు ఎంతసేపు నిద్రపోవాలి?:

  • అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 నెలల వరకు రోజుకు 14 నుంచి 17 గంటల నిద్ర పోవాలి.
  • 4 నుంచి 11 నెలల పిల్లలు.. 12 నుంచి 14 గంటలు
  • 12 నుంచి 35 నెలల చిన్నారులు 11 నుంచి 14 గంటలు
  • 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు
  • 6 నుంచి 13 సంవత్సరాల వారు 9 నుంచి 11 గంటలు
  • 14 నుంచి 17 వరకు 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి.
  • 18 నుంచి ఆపై ఉన్న వారు రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.

రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదా..? ఈ నియమాలు పాటిస్తే చాలు..

నిద్ర సరిపోకపోతే.. మనిషికి నిద్ర సరిపోకపోతే హార్ట్ నుంచి మొదలు షుగర్, బీపీ వరకూ ఎన్నో రోగాలు ఎటాక్ చేస్తాయి. దీర్ఘకాలంలో అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా చుట్టుమడతాయి. ఒకటీ రెండు అని కాకుండా ఎన్నో ఇబ్బందులు వచ్చిపడతాయని నిపుణులు చెబుతున్నారు.

రాత్రివేళ ఫోన్​ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై 2022లో "నేచర్‌" జర్నల్​లో ఓ కథనం పబ్లిష్ అయ్యింది. 800 మంది యువకులకు 16 రాత్రుల పాటు స్మార్ట్‌ఫోన్ ఇచ్చి.. పరిశీలించారు. సకాలంలో నిద్రపోయిన వారికీ.. ఫోన్​తో గడిపి ఆలస్యంగా నిద్రపోయిన వారి మధ్య సమస్య ఉందని గుర్తించారు.

మరి ఈ సమస్యకు పరిష్కారం అంటే.. దీనికి వైప్యులు ఒకటే మాట చెబుతున్నారు. "మన హెల్త్​ బాగుండాలంటే.. సరైన నిద్ర అవసరం" అంటున్నారు. ఇందుకు మీ వర్క్ షెడ్యూల్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన సమయానికి పనులు ముగించుకొని.. సరైన టైమ్​కు నిద్రపోయేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అంటున్నారు. మరీ ముఖ్యంగా.. బెడ్​ ఎక్కే సమయానికి ఫోన్​తో పని ముగించుకొని పక్కన పడేయాలని సూచిస్తున్నారు. అవసరమైతే స్విఛ్చాఫ్ చేసుకోవాలని కూడా చెబుతున్నారు.

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

మౌత్ గార్డ్​తో నిద్రపోతున్నారా..? ఏం జరుగుతుందో తెలుసా??

నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించడం డేంజరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.